కుమార్తె పెళ్ళికి 71 లక్షలు కావాలా…? అర్జెంట్ గా ఈ ఎకౌంటు ఓపెన్ చేయండి…!
central govt scheme: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అమ్మాయిల వివాహాలకు సంబంధించి చాలా కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కు శ్రీకారం చుట్టిన విధంగా దేశ వ్యాప్తంగా పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల రూపంలో వివాహాలకు నిధులు అందిస్తున్నాయి. పెళ్లి చేయడానికి ఇబ్బంది పడే వారికి మేమున్నాం అని చెప్తున్నాయి.
తెలంగాణాలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఏ ఇబ్బందులు లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నది. ఇక central govt scheme ద్వారా కూతురి పెళ్ళికి ఏకంగా 71 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సుకన్య సమృద్ది యోజన పథకం ద్వారా అంత మొత్తం పొందే అవకాశం కల్పించింది కేంద్రం.
central govt scheme ప్రయోజనాలు పొందాలి అంటే బాలిక పుట్టిన పదేళ్ళ లోపు ఆమెపై సుకన్య సమృద్ది సేవింగ్స్ ఎకౌంటు ఓపెన్ చేయాలి. కుటుంబంలో ఇద్దరు కూతుళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 250 రూపాయలతో ఎకౌంటు ఓపెన్ చేసి ప్రతీ ఏటా లక్షా 50 వేల వరకు గరిష్టంగా జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకౌంటు ఓపెన్ చేసిన డేట్ నుంచి 15 ఏళ్ళ వరకు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎకౌంటు మెచ్యూరిటీకి వచ్చేస్తుంది.