Snake Venom : మనిషి ప్రాణాలు తీసే పాము విషమే.. తిరిగి ప్రాణాలు కాపాడుతుంది.. ఎలాగో తెలుసా?
Snake Venom : స్నేక్ వెనమ్.. దాన్నే పాము విషం అంటాం. ఈ ప్రపంచంలో విషపూరితమైన పాములు చాలానే ఉంటాయి. కానీ.. అవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో లాన్స్ హెడ్ స్నేక్ అనేది ఒకటి. ఈ పాములు.. ఎక్కువగా దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఈ పాములు ఒక్కసారి కాటు వేసాయంటే ఇక ప్రాణాలు పోయినట్టే. ఆన్ ద స్పాట్ లో చనిపోవాల్సిందే. అంత డేంజరస్ పాములు ఇవి.

superglue from snake venom prevents death
అయితే.. ఈ పాములు తమ విషంతో మనుషుల ప్రాణాలను ఎలాగైతే తీస్తున్నాయో.. అదే విషంతో మనుషుల ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారు కదా. అవును.. నిజమే.. ఆ పాము నుంచి విషాన్ని బయటికి తీసి.. ఆ విషంతో మందులు చేసి ఎంతో మందిని కాపాడుతున్నారు. విచిత్రంగా ఉంది కదా. ఒక వైపు అదే పాము కాటు విషానికి కొందరు బలి అవుతున్నారు. మరోవైపు.. అదే పాము విషంతో మనుషుల ప్రాణాలను నిలబెడుతున్నారు.

superglue from snake venom prevents death
Snake Venom : పాము విషంతో సూపర్ గ్లూ తయారీ
ఆ విషపూరితమైన పాము విషంతో.. సూపర్ గ్లూ అనే ఓ మందును తయారు చేస్తున్నారు. కెనడాలోని వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్.. ఆ పాము విషం నుంచి సూపర్ గ్లూను తయారు చేస్తున్నారు. ఆ గ్లూ ఎలా పనిచేస్తుందంటే.. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే.. అక్కడ ఎక్కువగా రక్తం పోతుంది. ఆ సమయంలో రక్తం పోకుండా ఆపగలిగితే.. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడొచ్చు. అదే కాన్సెప్ట్ తో ఈ సూపర్ గ్లూను తయారు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగగానే.. ముందు రక్తం పోకుండా ఆపుతారు. అంటే.. ఈ సూపర్ గ్లూను గాయాలు అయిన చోటు అతికిస్తారు. దీంతో రక్తం కారదు. ఆ గ్లూ చర్మంలోని కణాలతో కలిసి పోతుంది. తద్వారా.. రక్తం శరీరంలోనుంచి బయటికి రాకుండా ఈ గ్లూ అడ్డుకుంటుంది.

superglue from snake venom prevents death
అయితే.. ఈ సూపర్ గ్లూను తయారు చేయడానికి.. లాన్స్ హెడ్ జాతి పాములనే పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే.. ఆ పాము విషంలో ఉండే రెప్టైలేజ్ అనే బ్లడ్ క్లాటింగ్ ఎంజైములు.. మనుషుల ప్రాణాలను కాపాడుతాయట. పాము విషం నుంచి ఆ ఎంజైమ్ ను తీసి.. దాన్ని ఒక జెలటిన్ తో కలిపి.. చిన్న ట్యూబుల్లో భద్రపరుచుతారట. ఆ ట్యూబుల నుంచి దాన్ని తీసి.. చర్మం మీద రుద్దుతారు. అలా.. ఏదైనా ప్రమాదంలో రక్తం ఎక్కువగా పోతున్నవాళ్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.