YS Viveka Murder Case : వివేకా కేసులో సుప్రీం సీరియస్ ఆదేశాలు..!
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టు చేరుకున్న ఆకేసు చివరకు సుప్రీం దాకా వెళ్లింది. అయితే.. వివేకా మర్డర్ కేసు విచారణ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. నిజానికి ఈ నెల 30 కల్లా ఆ కేసు క్లోజ్ అవ్వాలి. దర్యాప్తును ముగించేయాలని. కోర్టులోనూ సబ్మిట్ చేయాలి. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తును జూన్ 30 వరకు […]
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టు చేరుకున్న ఆకేసు చివరకు సుప్రీం దాకా వెళ్లింది. అయితే.. వివేకా మర్డర్ కేసు విచారణ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. నిజానికి ఈ నెల 30 కల్లా ఆ కేసు క్లోజ్ అవ్వాలి. దర్యాప్తును ముగించేయాలని. కోర్టులోనూ సబ్మిట్ చేయాలి. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది. అంటే ఇంకా రెండు నెలల సమయం ఉన్నదన్నమాట.
అయితే.. కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త ఆరోపణలు వస్తున్నాయి. కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజకీయంగా వచ్చే స్పందనలు అన్నీ రకరకాలుగా ఉంటున్నాయి. నిజానికి సీబీఐ వాళ్లే దర్యాప్తు గడువును పెంచాలన్నారు. ఈ ఘటన జరిగి కూడా నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఈ కేసు ఒక కొలిక్కిరాలేదు. నాలుగేళ్ల విచారణలో తేలని అంశాలు ఈ ఒక్క నెలలో తేలుతాయా? ఇప్పుడు సీబీఐ కొత్త బృందం ఈ కేసును టేకప్ చేస్తోంది. రెండు నెలల్లో ఈ కేసును దర్యాప్తు చేసి ముగించబోతోంది.
YS Viveka Murder Case : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు
ఇక.. సీబీఐ అనుమానితుల్లో కీలకంగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారం మొత్తం ఏమైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోవాలని.. హైకోర్టు కూడా ఈ కేసును త్వరగా విచారణ చేపట్టి తేల్చాలని ఆదేశించింది. ఇక.. వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ తాజాగా విచారిస్తోంది. ఆయన సీబీఐకి ఏం చెప్పారో మాత్రం తెలియదు కానీ.. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది.