Diabetes : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. డయాబెటిస్‌కు రాయితీ..
Diabetes : ప్రస్తుత గజిబిజి జీవితంలో ఎవరు ఎప్పుడు తింటున్నారో ఎంత తింటున్నారో ఎందుకు తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తున్నారు. ఇలా గజిబిజి వలనే మనకు పూర్వకాలం లేని చాలా రకాల వ్యాధులు వచ్చి పడుతున్నాయి. పద్ధతులు పాటించే చాలా మందికి ఎటువంటి వ్యాధులు రావడం లేదు. కానీ ఓ పద్ధతి అంటూ లేకుండా జీవితం గడుపుతున్న చాలా మందికి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు అనేందుకు కూడా నోరు తిరగని జబ్బులన్నీ వచ్చి పడుతున్నాయి.
కొత్తగా కరోనా వచ్చి ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సఫర్ అవుతున్న జబ్బు మధుమేహం. ఇంగ్లిష్ లో డయాబెటిస్ అని పిలిచే ఈ వ్యాధి వలన అనేక మంది చింతిస్తున్నారు. ఈ వ్యాధి వస్తే చెక్కెర లు తినడం తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. అనేక విధాలుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ మనకు వచ్చిన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని మనం చెప్పలేం. ఈ విషయంలో వైద్యులు కూడా ఏం చేయలేకపోతున్నారు. జీవనశైలి విధానాల వలనే అనేక మందికి డయాబెటిస్ సోకుతున్నట్లు పేర్కొంటున్నారు.
Diabetes : ఆ మహమ్మారి వస్తే లక్షలు ఖర్చు..
తాజాగా డయాబెటిస్ వ్యాధిపై కేంద్ర సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. డయాబెటిస్ అనేది నిశ్శబ్ధ మహమ్మారి అని అభివర్ణించారు. ఈ మహమ్మారి కనుక సోకితే లక్షల రూపాయలు వైద్యానికే ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డయాబెటిక్ పేషంట్లకు చికిత్సలో రాయితీలు ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్వీ రమణ చేసిన రిక్వెస్ట్ ను పట్టించుకుని డయాబెటిక్ పేషంట్లకు వైద్య ఖర్చులను తగ్గిస్తుందో లేదో వేచి చూడాలి. పేద వారికి కనుక ఈ వ్యాధి వస్తే చికిత్స చేయించుకోవడం చాలా కష్టమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.