YS Viveka Case : “వెంటనే అతన్ని మార్చండి ” వైఎస్ వివేకా కేసులో సుప్రీం సంచలన తీర్పు..!!
YS Viveka Case : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉండటంతో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ సీబీఐ పై సీరియస్ కావడం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ MR షా కేసు విచారణ ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఈ హత్య కేసును మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న అధికారిని వెంటనే మార్చాలని సీబీఐకి సూచించడం జరిగింది. ఇదే సమయంలో సీబీఐ డైరెక్టర్ మార్పు అభిప్రాయాన్ని కోర్టుకు కూడా తెలియజేయాలని అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారు. చెప్పిందే చెబుతున్నారు. కానీ దోషుల్ని పట్టుకునేందుకు ఈ కారణాలు సరిపోవు.
వివేక హత్యలో భారీ కుట్ర ఉందని హైకోర్టు కూడా తెలియజేసింది. ఇటువంటి క్రమంలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. రాజకీయ కుట్ర అంటూ దర్యాప్తు ఈ రీతిగా సాగ తీయడం సరికాదు… ఎంతో కుట్ర దాగి ఉన్న ఈ కేసులో వెలికి తీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గనుక విచారణ అధికారిని వెంటనే మార్చాలని సుప్రీంకోర్టు ధర్మసనం సూచించింది.