Corona Cases : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పదా?
Corona Cases : హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపో.. ఉప్పెనలా మళ్లీ దూసుకువస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయని సంతోషపడుతున్న సమయంలోనే కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతూ అందరినీ మళ్లీ టెన్షన్ పెట్టిస్తున్నాయి.
ఎక్కువగా మహారాష్ట్రలో కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి కరోనా దేశంలోకి వచ్చినప్పుడు కూడా ఎక్కువ కేసులు నమోదు అయింది మహారాష్ట్రలోనే. రెండోసారి కూడా మహారాష్ట్రలోనే కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.
ఒక్క గురువారమే ముంబైతో కలిపి మహారాష్ట్రలో సుమారు 9000 కేసులు నమోదు అయ్యాయి. అందులో సుమారు వెయ్యి వరకు ముంబైలో నమోదు అయినవే. అందులో 56 మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు.
ఒక్క మహారాష్ట్రలోనే కరోనా వైరస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 21 లక్షల కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాలు సుమారు 52 వేల వరకు ఉన్నాయి.
Corona Cases : ఇలాగే కేసులు పెరిగితే మార్చి 1 నుంచి విద్యాసంస్థలు బంద్
ఒకవేళ కేసులు రోజురోజుకూ పెరిగితే.. మార్చి 1 నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూసేయాలని మహారాష్ట్ర మంత్రి వర్ష గైక్వాడ్.. అధికారులను ఆదేశించారు.
అయితే.. మహారాష్ట్ర మొత్తం ప్రాంతం కన్నా.. కేవలం ముంబై నుంచి మాత్రమే రోజు రోజుకూ 0.25 శాతం కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఒకవేళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతే.. కొన్ని రోజుల తర్వాత మహా మొత్తం లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించి కేసులు కట్టడి చేయాలని యోచిస్తున్నాయి. లేదంటే.. మహారాష్ట్ర నుంచి కరోనా మళ్లీ అన్ని రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉంది.