Surya Kumar Yadav : భార్యతో కలిసి తిరుమల తిరుపతిలో సందడి చేసిన క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ వీడియో వైరల్..!!
Surya Kumar Yadav : ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్య కుమార్ యాదవ్. అతి తక్కువ కాలంలోనే టీమ్ ఇండియాలో స్టార్ బ్యాట్స్ మ్యాన్ గా పేరు సంపాదించడం జరిగింది. సాధారణంగా బ్యాటింగ్ చేసే వ్యక్తి కొన్ని సందర్భాలలో ఒక్కొక్కరు ఒక్కో బ్యాంగిల్ లో బంతిని బౌండరీలు తరలించడంలో గేమ్ ఆడుతారు. కానీ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ మాత్రం అందరి ఆటతీరుతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటది. గ్రౌండ్ లో 360 డిగ్రీలలో షాట్స్ కొట్టడంలో మనోడు స్టైలే వేరు.
ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ బెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమల తిరుపతి దేవాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 కి సంబంధించి ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో..
చోటు సంపాదించుకుని టెస్టుల్లో అడుగుపెట్టడం జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో సూర్యను పక్కన పెట్టారు. కాగా ఇప్పుడు త్వరలో మార్చి ఒకటవ తారీకు నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించటంతో చాలామంది ప్లేయర్ లు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతిలో దైవ దర్శనం చేసుకున్నారు.
