Omicron virus : గుడ్ న్యూస్.. ఓమిక్రాన్ ప్రాణాంతకమేమీ కాదు.. కేవలం ఈ ట్యాబ్లెట్స్ తోనే కోలుకుంటున్న బాధితులు..!
దేశంలో ఓమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 415కు చేరగా… రాబోయే 2 వారాల్లో కేసుల సంఖ్య 1000 దాటుతుందని వైద్య నిపుణులు అంచానా వేస్తున్నారు. తాజా పరిణామాలు థర్డ్ వేవ్ కు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ పట్ల భయాందోలనలు ఇలా ఉండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు కాస్త ఊపిరి పీల్చుకునే విషయం చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయంటూ.. పెద్దగా చికిత్స అవసరం లేకుండానే బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు. ఓమిక్రాన్ ప్రాణాంతకమేమీ కాదంటున్నారు. కేవలం మల్టీ విటమిన్లు, పారాసెటమల్ ట్యాబ్లెట్ల ద్వారానే బాధితులు పూర్తిగా మహమ్మారి నుంచి బయట పడ్డారని వెల్లడించారు.
ఇప్పటి వరకు తమ ఆసుపత్రిలో 51 మంది ఓమిక్రాన్ బాధితులు చేరగా వారిలో 40 మందికి.. ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల అవసరమే రాలేదన్నారు. అయితే వీటిపై నిజ నిజాలు తేలాల్సి ఉంది.