Maruti suzuki – TATA Motors : మారుతి సుజుకి టాటా మోటార్స్ కంపెనీ తో పోటీ… ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఎప్పటికి వస్తుందంటే…
Maruti suzuki – TATA Motors : ఇప్పుడు కార్లను బాగా వాడుతున్నారు. కరోనా తగ్గాక కార్లు అధికంగా పెరిగాయి. వచ్చే కాలంలో ఇంటింటికీ ఒక కారు ఉండేలా ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా కార్లు కనిపిస్తున్నాయి. ప్రయాణం చేయాలంటే ఎంతో సులభంగా తక్కువ శ్రమతో కారులో వెళ్ళవచ్చని చాలామంది కార్లు కొంటున్నారు. అయితే కార్లు కొనే కస్టమర్లకు త్వరలోనే ఎలక్ట్రానిక్ కార్లను అందజేయబోతున్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో దేశంలోనే అతిపెద్ద విక్రయదారిగా ఉంది. అయితే త్వరలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి టాటా మోటార్స్ ఈకింగ్ షిప్ తో పోటీ పడనుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారును 2025 నాటికి దేశ మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కారును గుజరాత్ ఆధారిత ప్లాంట్లో తయారు చేస్తుంది. త్వరలోనే ఇది కస్టమర్లకు అందుబాటులో రానుందని తెలుస్తుంది. ఇంతకీ ఎలక్ట్రిక్ కార్ ధరంతో ఇప్పుడు తెలుసుకుందాం. మారుతి ఎలక్ట్రిక్ కార్ EV టెక్నాలజీ, బ్యాటరీ ధరను పరిగణలోకి తీసుకుంటే దీని ధర 10 లక్షల కు పైగా ఉంటుందని అనుకుంటున్నారు. కంపెనీ చెప్పిన దాని ప్రకారం దాని కొత్త EV చాలాకాలంగా పరీక్షించబడుతుంది. ఇది భారత దేశ వాతావరణ కి అనుగుణంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కాన్ ఉద్దేశం మనదేశంలో కాలుష్యాన్ని తగ్గించడం. కానీ ధర కూడా ఎక్కువే.
మారుతి ఎలక్ట్రిక్ కార్ మిడ్ సైజ్ SUV కావచ్చని వార్తలు వస్తున్నాయి. దీని కాన్సెప్ట్ ఫార్మాట్ను ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించవచ్చు. ఇది 48kwh,59kwh రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో అందించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందంట. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ను మారుతి సుజుకి 2025 నాటికల్లా మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ కార్ ను గుజరాత్ రాష్ట్రం లో ఆధారిత ప్లాంట్లో తయారు చేస్తుంది. త్వరలోనే మనం ముందుకు రాబోతుంది.