తిరుపతి ఉపఎన్నిక : టీడీపీ ట్రాప్ నుంచి తప్పించుకున్న వైసీపీ?
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది.. అంటే అది తిరుపతి ఉపఎన్నిక. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు చాలెంజింగ్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ అయితే మరోసారి తిరుపతిలో తమ జెండాను పాతాలని చూస్తోంది. టీడీపీ కూడా ఏం తక్కువ తినలేదు. ఈసారి తిరుపతిలో గెలిచి టీడీపీ సత్తాను చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు కొత్తగా బీజేపీ దూరుతోంది. మేమేమన్నా తక్కువ తిన్నామా? అన్న చందంగా.. ఈసారి తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని సవాల్ విసురుతున్నారు. దీంతో తిరుపతి ఉపఎన్నిక పోటీ త్రిముఖ పోటీగా మారింది.
అయితే.. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు మాత్రం చాలా దూకుడు మీదున్నాయి. టీడీపీ అయితే.. ఎలాగైనా వైసీపీని ఓడించాలన్న ధ్యేయంతో ఉంది. అందులో భాగంగానే… వైసీపీ పార్టీని రెచ్చగొట్టే ధోరణితో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల పెద్ద దుమారం లేచింది. దాన్ని సాకుగా చూపి.. వైసీపీని ఇరుకున పెట్టాలని టీడీపీ తెగ ప్రయత్నిస్తోంది కానీ.. టీడీపీ మాత్రం దాని ఉచ్చులో పడటం లేదు.
ఇప్పటికే టీడీపీ తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. కానీ.. వైసీపీ ఇంకా ప్రకటించలేదు. దీంతో తిరుపతి స్థానిక టీడీపీ నాయకులు.. వైసీపీ అభ్యర్థిని ప్రకటించాలంటూ పట్టుబడుతున్నారు. వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకే.. టీడీపీ ముందే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిందంటూ వార్తలు వస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కుదరదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరి.. తిరుపతి ఉపఎన్నికను మాత్రం ఎలా నిర్వహిస్తారు.. అనేదాన్ని పాయింట్ గా తీసుకొని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించింది టీడీపీ.
దుర్గా ప్రసాద్ కుటుంబానికి నో టికెట్
అయితే.. ఇటీవల మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి వైసీపీ నుంచి టికెట్ రావడం లేదని తెలిసిపోయింది. వేరే అభ్యర్థికి టికెట్ ను కేటాయిస్తున్నట్టుగా లీకులు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత అఫిషియల్ గా ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థిపై ఎటువంటి సమాచారం రాలేదు. ఒకవేళ ముందే అభ్యర్థిన ప్రకటిస్తే… టీడీపీ వ్యూహాత్మకంగా అడుగు వేసి.. స్థానిక సంస్థల ఎన్నికలను లింక్ పెడుతుందని భావించి.. వైసీపీ ఆచీతూచీ అడుగులేస్తోంది. టీడీపీ ట్రాప్ లో పడటం లేదు. దీంతో టీడీపీ గింజుకుంటోది. ఏం చేయాలో తెలియక నెత్తి పట్టుకొని కూర్చుంటున్నారు టీడీపీ నేతలు.