Atchannaidu : పార్టీ లేదు… బొక్కా లేదు… టీడీపీపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు.. వీడియో లీక్

0
Advertisement

Atchannaidu : అసలే తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా? గెలవదా? అనే పెద్ద డౌట్. దానికి తోడు ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ టు వైరల్ అవుతోంది. అదేదో కాదు.. టీడీపీని కొంప ముంచే వీడియో. నిజం చెప్పాలంటే… ఆ వీడియో గురించి ఏపీ ప్రజలందరికీ తెలిస్తే… టీడీపీ ఇక భూస్థాపితమే. అవును… ఇప్పుడు టీడీపీ మీద ఏపీ ప్రజలకు ఉన్న ఆ కాసింత గౌరవం కూడా పోతుంది. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరమే. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

tdp ap president atchannaidu video leaked goes viral
tdp ap president atchannaidu video leaked goes viral

ఇంకో నాలుగు రోజులు అయితే తిరుపతి లోక్ సభ ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. ఇంకో రెండు రోజుల్లో ప్రచారం కూడా ముగుస్తుంది. కానీ.. ఇంతలో టీడీపీ కొంప ముంచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్నది.. టీడీపీపై విమర్శలు చేసింది ఎవరో కాదు… టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. అందుకే… ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే చర్చ. ఈ వీడియోను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేశారు.

Atchannaidu : ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఆ వీడియోలో ఉన్నది నలుగురు వ్యక్తులు. అందులో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు అచ్చెన్నాయుడు సిబ్బంది. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇంకో వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలియదు. అతడే ఈ వీడియోను తీసినట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు రూమ్ లో కూర్చొని ప్లేట్ లో టిఫిన్ పెట్టుకొని తింటున్నారు. ఆయనకు సిబ్బంది వడ్డిస్తున్నారు. ఇంతలో అచ్చెన్నాయుడు ముందు కూర్చున్న వ్యక్తి(బహుశా టీడీపీ లీడరే కావచ్చు) తన బాధలను అచ్చెన్నాయుడుతో చెప్పుకున్నాడు.

టీడీపీని నమ్ముకొని రోడ్డున పడ్డానండి. నా ఫోన్ కూడా ఎత్తడం మానేశారండి. రాజగోపాల్ ఎత్తడం లేదు… రమేశ్ ఎత్తడం లేదు… అని ఆ వ్యక్తి అచ్చెన్నాయుడితో చెబుతాడు. దీంతో వెంటనే అచ్చెన్నాయుడు.. ఈ 17 తర్వాత ఫ్రీ అయిపోతాం.. ఇక పార్టీ లేదు… బొక్కా లేదు.. అంటూ అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మళ్లీ ఆ వ్యక్తి మాట్లాడుతూ… అయిపోయింది సార్… పార్టీ అయిపోయింది… మీరు ఏమన్నా అనుకోండి.. జీరో అయిపోయింది. జీరో అయితే మనకేమన్నా ఉందా? మన పార్టా? అంటూ మరోసారి అచ్చెన్నాయుడు టీడీపీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.మరీ ఇంత దారుణమా సార్.. 30 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినందుకు ఫోన్లు ఎత్తడం మానేశారు.. లోకేశ్ అయితే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటే చేసుకోండి అని అంటున్నారు. స్టేట్ పార్టీ మీటింగ్ లో పెద్దాయనను కలిసినప్పుడు లోకేశ్ దగ్గరికి వెళ్తే… ఇంతకుముందు అన్నా అనేవాడు… ఇప్పుడు అక్కడికెళ్లి కూర్చో అమ్మా.. అని అంటున్నాడు.. అని ఆ వ్యక్తి అనగానే.. నీదే కాదు… అందరిదీ అదే పరిస్థితి.. అందరికీ అలాగే ఉంది అంటూ అచ్చెన్నాయడు చెప్పుకొచ్చారు.

వీళ్లంతా బాగుంటే ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తది.. పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు అవుతుంది.. అంటూ అచ్చెన్నాయుడు కూడా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యక్తి అయితే లోకేశ్ ను వాడు వీడు అంటూ ఇష్టం ఉన్నట్టు తిట్టేయడం వీడియోలో చూడొచ్చు.. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్ రెడ్డి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండటంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేశ్ విసిరిన సవాల్ కు తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేదు. నారా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు… అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. అయితే… ఈ వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు.

 

Advertisement