TDP : ఆ విషయంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి ఉందా?
TDP : రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పేర్కొన్నారు. గత రెండు మూడు రోజులుగా తెలుగు దేశం పార్టీ నాయకులు పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ విషయం లో రాజకీయం చేసే ప్రయత్నాలు చేసి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును కూడా రాజకీయం చేసి లబ్ది పొందాలని తెలుగు దేశం పార్టీ నాయకులు చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని
ప్రశాంత వాతావరణంలో పకడ్బందీ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలియ జేశారు.పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పరీక్ష పేపర్ లీకేజీ విషయం బయటకు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకున్నామని.. ఆ తర్వాత ఎక్కడ కూడా మళ్లీ లీకేజీ వ్యవహారం జరగలేదని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల విషయంలో తెలుగు దేశం పార్టీకి మాట్లాడే అర్హత లేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి దానిని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించే తెలుగుదేశం పార్టీకి పదోతరగతి పరీక్షలు కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ
మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోపాలు లేవని అలాగే ప్రతి చోట కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత లోపభూయిష్టంగా పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం అప్పట్లో మీడియాలో కూడా వచ్చిందని.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకు అసౌకర్యం కలగకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం అంటూ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. తెలుగు దేశం పార్టీకి విద్యార్థుల చదువు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.