TDP – YSRCP : వైసీపీ ప్లీనరీకీ, టీడీపీ మహానాడుకీ పోలికా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP – YSRCP : వైసీపీ ప్లీనరీకీ, టీడీపీ మహానాడుకీ పోలికా.?

 Authored By prabhas | The Telugu News | Updated on :10 July 2022,1:30 pm

TDP – YSRCP : తెలుగుదేశం పార్టీ మొన్నీమధ్యనే మహానాడు నిర్వహించింది. ఇప్పుడు వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వైసీపీ, ఈ ప్లీనరీ సమావేశాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహంచడంలో వింతేముంది.?
ప్లీనరీ సమావేశం ఏ రాజకీయ పార్టీకి అయినా అత్యంత కీలకం. కీలక నిర్ణయాలన్నీ ఇలాంటి వేదికల మీదనే తీసుకుంటారు. మహానాడు సైతం అంతే. టీడీపీ నిర్వహించిన మహానాడులో, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి.? అంటే సమాధానం చెప్పేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేదు.

సో, టీడీపీ నేతలకు వైసీపీ ప్లీనరీని విమర్శించే నైతిక హక్కు లేదు. నిజానికి, టీడీపీ మహానాడులో పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడానికే టీడీపీ నేతలు పోటీ పడ్డారు. బూతులు మాట్లాడారు కొందరు టీడీపీ నేతలు. వాటికి సమాధానం ఇవ్వాలని వైసీపీ నేతలు అనుకుంటే, వైసీపీ ప్లీనరీ ఇంకోలా వుంటుంది. వైసీపీ ప్లీనరీ వేదికగా, వైఎస్ విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్‌తోపాటు వేదిక పంచుకున్నారు. పార్టీకి దూరమవుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరగానే వుంటానన్నారు.

TDP Mahanadu Vs YSRCP Plenary

TDP Mahanadu Vs YSRCP Plenary

తల్లిగా ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట వుంటాననీ చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు.. అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఆ విమర్శలకు ప్లీనరీ వేదికగా విజయమ్మ తగిన సమాధానం చెప్పకనే చెప్పారు. ఇక, టీడీపీ మీద వైసీపీ నేతల విమర్శల విషయానికొస్తే, ఇవి నిజానికి చాలా చాలా తక్కువే. తొలి రోజు నాలుగు కీలక తీర్మానాలు జరిగాయి. ఈ రోజు మరికొన్ని తీర్మానాలు జరుగుతాయి. ప్లీనరీ అనేది పార్టీ అంతర్గత వ్యవహారం. టీడీపీ మహానాడు జరిగిన వైనం, వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వైనం పోల్చి చూస్తే.. అసలు మహానాడు అనేది పచ్చ బూటకం అని ఇట్టే అర్థమవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది