TDP – YSRCP : సునీత వర్సెస్ ప్రకాశ్.. రాప్తాడులో ఏం జరుగుతోంది? ఆ కంపెనీ విషయంలో ఇంత రచ్చ జరుగుతోందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP – YSRCP : సునీత వర్సెస్ ప్రకాశ్.. రాప్తాడులో ఏం జరుగుతోంది? ఆ కంపెనీ విషయంలో ఇంత రచ్చ జరుగుతోందా?

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2022,2:20 pm

TDP – YSRCP : రాప్తాడు నియోజకవర్గం తెలుసు కదా. అది చాలా కీలకమైన నియోజకవర్గం. ఒకప్పుడు అది టీడీపీకి కంచుకోట. అనంతపురం జిల్లా అంటేనే ఎక్కువగా టీడీపీకి కంచుకోట అని చెప్పుకోవాలి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ కూడా అక్కడ తన జెండాను పాతుతోంది. అయితే.. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం ఓ కంపెనీ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది. పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ప్రకాశ్ టార్గెట్ గా పరిటాల ఫ్యామిలీ కూడా విరుచుకుపడుతోంది.

రాప్తాడులో తీవ్రస్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయిన పరిటాల ఫ్యామిలీ అంటుంటే.. అసలు టీడీపీ హయాంలోనే పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేసిందని ప్రకాశ్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. టీడీపీ హయాంలో జాకీ అనే గార్మెంట్ ఫ్యాక్టరీని రాప్తాడులో నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. కంపెనీ ప్రతినిధులు, అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదిరింది. భూములను సేకరించారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ప్రకాశ్.. కంపెనీ ప్రతినిధులను బెదిరించారట. దీంతో ఆ పరిశ్రమ తెలంగాణకు వెళ్లిపోయిందంటూ పరిటాల సునీత తెలిపారు.

tdp versus ysrcp in raptadu in ap

tdp versus ysrcp in raptadu in ap

TDP – YSRCP : జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీపైనే రచ్చ

రూ.200 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమను రాప్తాడులో ఏర్పాటు చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని.. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తమకు కమిషన్లు ఇస్తేనే ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పర్మిషన్ ఇస్తామని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనికి ఒప్పుకోని కంపెనీ ప్రతినిధులు.. తమ కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేశారు. దీనిపైనే రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. మాటల యుద్ధం నడుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది