TDP : చంద్రబాబుకు బిగ్ షాకిచ్చిన కీలక నేత… పార్టీ పదవికి రాజీనామా
TDP : ఏపీ టీడీపీకి మరో షాక్ తగిలింది. చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే… పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో… ఆ నిర్ణయాన్ని విభేదించిన జ్యోతుల నెహ్రూ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

tdp senior leader jyothula nehru resigned
అయితే… తాను జగ్గంపేట నియోజకవర్గం ఇన్ చార్జ్ గా కొనసాగుతానని నెహ్రూ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన కొద్దిసేపటికే నెహ్రూ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవికి రాజీనామా చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది.
2014 లో వైసీపీ నుంచి గెలిచిన నెహ్రూ… 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ… జగన్ కు చాలా సన్నిహితంగా మెలిగేవారు.

tdp senior leader jyothula nehru resigned
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించడం.. నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అందుకే… నేను టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా… అని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు.