Vidadala Rajini : విడదల రజిని నెత్తిన పిడుగు వేసిన మాజీ మంత్రి గారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidadala Rajini : విడదల రజిని నెత్తిన పిడుగు వేసిన మాజీ మంత్రి గారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 October 2022,6:30 am

Vidadala Rajini : విడదల రజని ప్రస్తుతం ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే.. మంత్రి విడదల రజనిపై టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం సమస్య ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే కదా. తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలంటూ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీపై విరుచుకుపడ్డారు. విడదల రజని ఒక ఊసరవెల్లి అని, సీఎం పక్కన కూర్చోవడానికి తను సిగ్గుపడాలని ప్రత్తిపాటి విమర్శించారు. అసలు.. మంత్రి విడదల రజని చేసిందే అసలైన వెన్నుపోటు అంటూ పుల్లారావు విమర్శించారు. గతంలో రజని టీడీపీలో ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉండి, మహానాడు సభలో తాను చంద్రబాబు నాటిన మొక్కనంటూ చెప్పుకొచ్చిన విడదల రజని..

tdp senior leader prathipati pulla rao comments on vidadala rajini

tdp senior leader prathipati pulla rao comments on vidadala rajini

Vidadala Rajini : విడదల రజని అసలైన వెన్నుపోటు పొడిచింది

అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ను రాక్షసుడంటూ మాట్లాడారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత జగన్ రాక్షసుడు అని చెప్పి.. ఆ తర్వాత ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరారని ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. అసలు విడదల రజని చేసిందే అసలైన వెన్నుపోటు అంటూ పుల్లారావు చెప్పారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించి, జగన్ పార్టీలో చేరడం అసలైన వెన్నుపోటు అంటూ పుల్లారావు విమర్శించారు. అలాంటి వ్యక్తులకు ఏకంగా ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? అంటూ పుల్లారావు ప్రశ్నించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది