Vidadala Rajini : కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు.. విడదల రజిని కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Vidadala Rajini : కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు.. విడదల రజిని కామెంట్స్
Vidadala Rajini : కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కొక్కరిపై పంజా విసురుతుండడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా విడదల రజనీకి షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో ఓ స్టోన్‌క్రషన్ యజమానిని బెదిరించి.. రూ.2.02 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఆమెపై ఏసీబీ కేసు నమోదయ్యింది.

Vidadala Rajini : కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు.. విడదల రజిని కామెంట్స్
Vidadala Rajini యాక్షన్ రియాక్షన్..
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో విడదల రజిని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ కాగా, ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని 7,7ఏ, ఐపీసీ 384, 120బీ సహ పలు సెక్షన్లను చేర్చింది. ఇందులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలుగా పేర్కొంది.
అయితే ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు అని విడదల రజిని అన్నారు. కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేశారు .కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు . ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోంది అని విడదల రజిని అన్నారు. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: విడదల రజిని
కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేశారు
కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోంది
– విడదల రజిని https://t.co/QkMZxlTSjF pic.twitter.com/gIeiWgCXks
— BIG TV Breaking News (@bigtvtelugu) March 23, 2025