TDP : టీడీపీ సీనియర్ నేతలంతా.. వైసీపీలో చేరకుండా భలే ప్లాన్ వేశారు.. రెండు పార్టీలకు షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీ సీనియర్ నేతలంతా.. వైసీపీలో చేరకుండా భలే ప్లాన్ వేశారు.. రెండు పార్టీలకు షాక్?

 Authored By sukanya | The Telugu News | Updated on :6 August 2021,6:30 am

ఏపీ రాజకీయం ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వరసపెట్టి గెలుస్తోంది. అది వాపో బలమో ఎవరికీ తెలుయదు. ఎందుకంటే వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది నిజమైన గెలుపా కాదా ? అన్న దాని మీద ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అలాగని టీడీపీ పుంజుకుందా అంటే ఆ పార్టీ నాయకులే గట్టిగా చెప్పలేకపోతున్నారు. మరో వైపు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజ‌యాలను మూటకట్టుకుంటోంది. టీడీపీకి ఉత్తరాంధ్ర‌, గోదావరి జిల్లాలు, కోస్తాలో ఒకపుడు మంచి పట్టు ఉండేది. ఇపుడు ఈ జిల్లాలు ఏవీ కూడా కలసిరావడంలేదు. ఓడిపోవడం వరకూ ఓకే కానీ మరీ సింగిల్ డిజిట్లకు పడిపోవడం ఏంటి అన్నదే టీడీపీలో అంతర్మధనంగా ఉంది. ఇదిలా ఉంటే టీడీపీలో నాయకత్వ సమస్య కూడా చాలా ఉంది.

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తారు అని ప్రచారం ఇప్పటిదాకా జరుగుతున్నా కూడా అప్పటికి చంద్రబాబు వయసు 74 నిండా నిండిపోవడంతో అదే ఇప్పుడు తమ్ముళ్ళ మధ్య చర్చకు వస్తోంది. యువ నాయకుడిగా నారా లోకేష్ ఉన్నా ఎక్కడా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. నారా లోకేష్ దక్షత కూడా ఈ రోజుకీ రుజువు కాలేదు. మంగళగిరిలో ఓటమి తరువాత లోకేష్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. నారా లోకేష్ కూడా తమలాగానే ఓడిపోయారని, నారా లోకేష్ చెబితే తాము ఎందుకు వినాలి అన్న భావన కూడా పార్టీ నాయకుల్లో కలుగుతోంది.

TDP

TDP


బీజేపీ దిశగా.. TDP 

మరో వైపు చూస్తే పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతో ఉత్తరాంధ్రలోని కీలకమైన టీడీపీ నేతలు ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీలో చేరాలంటే అక్కడ అంతా కిక్కిరిసిపోయి ఉంది. పైగా తమను ఓడించిన నేతలే అక్కడ ఉన్నారు. వారు ముందు చేతులు కట్టుకుని ఉండే సీన్ లేదు. ఇక వైఎస్ జగన్ సైతం టీడీపీ నేతలను రానిచ్చే ఛాన్స్ ఎక్కడా కనిపించడంలేదు. ఒకవేళ పార్టీ కండువాలు కప్పినా పదవులు ఇస్తారన్న గ్యారంటీ ఏదీ లేదు. దాంతో టీడీపీ మీద మొహం మొత్తిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు అన్నదే తాజా టాక్ గా వినిపిస్తోంది. ఇందులో కొంతమంది బిగ్ షాట్స్ కూడా ఉన్నారని అంటున్నారు.

Chandra babu

Chandra babuCh

చంద్రబాబుకు టీడీపీలో పట్టు లేకపోవడం, లోకేష్ నాయకత్వం మీద నమ్మకం లేని వారంతా బీజేపీలో చేరి గౌరవప్రదమైన రాజకీయం చేయాలనుకుంటున్నారని కేడర్ చర్చించుకుంటోంది. ఈ లిస్టులో ముందుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపించింది. ఆ త‌ర్వాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, అవుట్ డేటెడ్ టీడీపీ లీడ‌ర్ల చూపు బీజేపీ మీదే ఉంద‌ని అంటున్నారు. వీరు పార్టీ మారితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొందరలోనే కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అదే వాస్తవమైతే, బీజేపీ ఓ రేంజ్ లో దూసుకెళ్లే ఛాన్స్ ఉందని చర్చలు సాగుతున్నాయి. అయితే బీజేపీలో నేతలు చేరినా, పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది