Team India : ఎట్ట‌కేల‌కి భార‌త్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. సాయంత్రం భారీ ర్యాలీ.. ఎక్క‌డంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India : ఎట్ట‌కేల‌కి భార‌త్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. సాయంత్రం భారీ ర్యాలీ.. ఎక్క‌డంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2024,12:00 pm

Team India : దాదాపు 17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ రెండో సారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల భారత ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. గెలిచిన వెంటనే మైదానంలో ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అయితే ఫైన‌ల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

Team India గ్రాండ్ వెల్‌క‌మ్..

వాస్తవానికి ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉండగా.. బార్బోడస్‌లోని భారీ తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది. ప్ర‌త్యేక విమానంలో కొద్ది సేప‌టి క్రితం టీమిండియా భార‌త్‌లో అడుగుపెట్టింది. వారికి అభిమానులు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. విజయోత్సవ ర్యాలీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు టీమిండియా ఆటగాళ్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రపంచకప్ గెలిచి ఆటగాళ్లను ప్రభుత్వం తరఫున సత్కరించనున్నారు. ఇక ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుతో ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయంత్రం 5 గంట‌ల‌కి వేడుక జ‌ర‌గ‌నుంది.

Team India ఎట్ట‌కేల‌కి భార‌త్‌లో అడుగుపెట్టిన టీమిండియా సాయంత్రం భారీ ర్యాలీ ఎక్క‌డంటే

Team India : ఎట్ట‌కేల‌కి భార‌త్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. సాయంత్రం భారీ ర్యాలీ.. ఎక్క‌డంటే..!

ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా ఇలానే ముంబైలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు టీమిండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో మునిగితేలారు. అప్పటి ఫొటోను జైషా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే విధంగా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విజయోత్సవ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని అభిమానులను కోరాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది