Telangana Govt : శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారి జీతం భారీగా పెంపు.. ఉత్తర్వులు జారీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Govt : శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారి జీతం భారీగా పెంపు.. ఉత్తర్వులు జారీ!

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది. ఆశా వర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆశా వర్కర్లు ఇక నుంచి నెలకు రూ. 7500 కు బదులు… రూ. 9750 నగదును నెలవారీ వేతనంగా అందుకోనున్నారు. గతేడాది జూన్ నుంచి ఈ పెంచిన జీతాలను అమలు చేస్తామని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ […]

 Authored By inesh | The Telugu News | Updated on :6 January 2022,11:40 am

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది. ఆశా వర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆశా వర్కర్లు ఇక నుంచి నెలకు రూ. 7500 కు బదులు… రూ. 9750 నగదును నెలవారీ వేతనంగా అందుకోనున్నారు. గతేడాది జూన్ నుంచి ఈ పెంచిన జీతాలను అమలు చేస్తామని పేర్కొంది.

కాగా రాష్ట్రంలోని.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పని చేస్తోన్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరోనా సమయంలో అందించిన సాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆశా వర్కర్లను ఇక నుంచి తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు.

Telangana asha workers salary increased by govt

Telangana asha workers salary increased by govt

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లను మరింత భాగస్వాములను చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్హతలున్న ఆశా వర్కర్లకు ఏఎన్ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని ఆయన గతంలో హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ తమ జీతాలు పెంచుతూ తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది