విజయశాంతి – ఇకపై ‘రాములమ్మ’ కాదు??
విజయశాంతి అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ పరిస్థితి తెలంగాణలో మారుతుంది అని అంతా భావించారు. బీజేపీలో చేరినందుకు విజయశాంతికి ఏ పదవి ఇస్తారో అని అంతా వెయిట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతికి ఉన్న ప్రాధాన్యత అయినా బీజేపీలో ఆమెకు దక్కుతుందా? అని అంతా భావిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం బీజేపీలో బాగానే సెట్ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కన్నా.. బీజేపీలోనే ఆమె దూకుడు ఎక్కువైనట్టు తెలుస్తోంది.
అయితే.. విజయశాంతి పార్టీలోకి వచ్చాక బీజేపీ బలం పెరిగిందా? అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం. అయితే.. ఆమె పార్టీలోకి రావడం వల్ల మాత్రం చోటా మోటా లీడర్లను బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమెకు బీజేపీలో పెద్ద పదవి ఇవ్వొద్దని కూడా అప్పట్లో డిమాండ్లు వచ్చాయి.
కానీ.. విజయశాంతికి మాత్రం త్వరలోనే మంచి పదవి లభించనుందట. ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని బీజేపీ హైకమాండ్ మాటిచ్చిందట. అయితే.. ఆమెకు ఎవరు హామీ ఇచ్చారు అనేది మాత్రం తెలియదు. జేపీ నడ్డా ఇచ్చార? లేక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చారా? అనేద తెలియదు.
కానీ.. ఒకవేళ ఆమెకు రాజ్యసభ పదవి వస్తే మాత్రం ఇక ఆమె రాములమ్మ కాదు. ఆమె రేంజ్ మారిపోనుంది. తెలంగాణలో బీజేపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.