ప్చ్… అంత మంచి చాన్స్ ను సీఎం కేసీఆర్ ఎలా మిస్ చేసుకున్నారు?
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి విరుగుడు హైదరాబాద్ లో తయారవుతోంది. అందుకే.. అందరి దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ కూడా కరోనా వాక్సిన్ ను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఆ తర్వాత ఏకంగా 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు భారత్ ను సందర్శించారు. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించారు. కోవిడ్ వాక్సిన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
64 దేశాల రాయబారులు హైదరాబాద్ ను సందర్శించడం అనేది మామూలు విషయం కాదు. వాళ్లు హైదరాబాద్ లో అడుగుపెట్టారంటేనే.. హైదరాబాద్ ప్రతిష్ఠ ఎక్కడికో పోతుంది. అటువంటప్పుడు హైదరాబాద్ ప్రతిష్ఠను దశదిశలా వ్యాపింపజేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది.
కానీ.. ఎందుకు సీఎం కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ కానీ… టీఆర్ఎస్ ప్రముఖులు కానీ.. 64 దేశాల రాయబారులను కలవలేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్లను ఎందుకు కలవనీయలేదు. మొన్న ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవలేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిశారు. తాజాగా రాయబారులను కూడా సోమేశ్ కుమారే కలిశారు. కానీ.. వేరే వాళ్లు కలిసే అవకాశమే దక్కలేదు.
సోమేశ్ కుమార్.. హైదరాబాద్ ఘన చరిత్రను రాయబారులకు తెలియజేసినా.. ఎందుకో కేంద్రం.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ను పక్కన పెడుతోందని స్పష్టంగా అర్థం అవుతోంది. సీఎం కేసీఆర్ ఇమేజ్ ను తగ్గించడం కోసం… మోదీ, అమిత్ షా ప్లాన్లలో ఇవి ఒక భాగం అని అంటున్నారు.
ఒకవేళ కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ కు రాయబారులను కలిసే అవకాశం లేకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ కు వచ్చిన రాయబారులను మర్యాదపూర్వకంగా అయినా కలిసే బాధ్యత సీఎం కేసీఆర్ కు ఉందని.. సీఎం కేసీఆర్ బంగారం లాంటి చాన్స్ మిస్ చేసుకున్నారంటూ మరోవైపు వార్తలు వస్తున్నాయి.