Telangana Next CM : తెలంగాణ తదుపరి సీఎం ఎవరో క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్
Telangana Next CM : గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఒకటే టాపిక్. నెక్స్ ట్ సీఎం కేటీఆర్ అవుతారని.. సీఎం కేసీఆర్ ఆరోగ్య కారణాలు, ఇతరత్రా కారణాల వల్ల తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని.. తన కొడుకు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయనున్నారని వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆశ కేసీఆర్ కు ఎప్పటి నుంచో ఉంది. కానీ.. ఓ వైపు తెలంగాణ రాజకీయాలు, మరోవైపు జాతీయ రాజకీయాలు.. ఈ రెండూ మేనేజ్ చేయడం సెట్ కాకపోవడంతో.. తెలంగాణను తన కొడుకుకు అప్పజెప్పి.. తాను జాతీయ రాజకీయాలు చూసుకోనున్నారంటూ వార్తలు షికారు చేశాయి.

telangana cm kcr clarity on telangana next cm
Telangana Next CM KTR : నా ఆరోగ్యం బాగానే ఉంది.. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా
అయితే.. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ భేటిలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ఆయన ఇక నోరు విప్పక తప్పలేదు.
నా ఆరోగ్యం బాగానే ఉంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను.. అంటూ టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.. అంటూ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడే కాదు.. ఇంకో 10 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉంటా.. అంటూ సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.