TRS : కేసీఆర్ కు కొత్త తలనొప్పి తెచ్చిన మరో ఎమ్మెల్యే.. ఇలా రెచ్చిపోతే టీఆర్ఎస్ పరువు గంగలో కలవదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TRS : కేసీఆర్ కు కొత్త తలనొప్పి తెచ్చిన మరో ఎమ్మెల్యే.. ఇలా రెచ్చిపోతే టీఆర్ఎస్ పరువు గంగలో కలవదా?

TRS : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన సాయం చేసి.. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలని బీజేపీ కోరింది. అందుకే.. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చందాలు వసూలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో చాలా గొడవలే జరిగాయి. టీఆర్ఎస్ కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. రామమందిరంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 January 2021,6:57 pm

TRS : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన సాయం చేసి.. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలని బీజేపీ కోరింది. అందుకే.. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చందాలు వసూలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో చాలా గొడవలే జరిగాయి. టీఆర్ఎస్ కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. రామమందిరంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల సీఎం కేసీఆర్ కు కూడా ఇబ్బందులు తలెత్తాయి.

bjp workers attack parkal mla challa dharma reddy house in hanmakonda

bjp workers attack parkal mla challa dharma reddy house in hanmakonda

తాజాగా టీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసి అడ్డంగా బుక్కయ్యారు. రాముడి పవిత్రతనే బీజేపీ అపవిత్రం చేస్తోంది.. అంటూ పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి.. దాడికి యత్నించారు. ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.

బీజేపీ నాయకులు అలా ఎలా చందాలు వసూలు చేస్తారు?

రాముడి పవిత్రతను అపవిత్రం చేయడమే కాకుండా.. బీజేపీ నాయకులు ఇష్టమున్నట్టు చందాలు వసూలు చేస్తున్నారని.. ధర్మారెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలు.. వీళ్లు వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇలా చందాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి? అంటూ ప్రశ్నించడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు.

అయితే.. ఇప్పటికే విద్యాసాగర్ రావు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్లీ క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. మళ్లీ.. మరో ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. పార్టీ పరువును కొందరు నాయకులు బజారుకీడుస్తున్నారని తన సన్నిహితుల వద్ద కేసీఆర్ వాపోయారట. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో.. కేసీఆర్ కు కొత్త తలనొప్పి వచ్చి చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ఇలాంటి వాళ్లు పార్టీ పరువును గంగలో కలపకుండా ఉండటానికి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది