ఢిల్లీలో సీఎం కేసీఆర్.. పంటి చికిత్స కోసమా? మోదీని కలవడానికా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అవును.. ఇవాళ ఉదయమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. అయితే.. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కొందరేమో పంటి చికిత్స కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నా.. మరికొందరు మాత్రం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అవుతారంటూ చెబుతున్నారు.

telangana cm kcr new delhi tour to meet pm modi
ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మూడు రోజులు ఉండనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నట్టు సమాచారం.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల విషయంపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ పై ఇంకా కేసీఆర్ కు పీఎంవో నుంచి సమాచారం రాలేదని.. ప్రస్తుతానికైతే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ ఉంటుందని సమాచారం.
అలాగే… తనను ఎప్పటినుంచో బాధిస్తున్న పంటి నొప్పికి సంబంధించిన చికిత్స కూడా కేసీఆర్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దాని కోసమే ఢిల్లీలో ప్రముఖ డెంటిస్టును కేసీఆర్ కలవనున్నారట. పంటి చికిత్సతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించడం కోసమే.. కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తోంది.