Electricity Bill : గృహజ్యోతి కరెంట్ బిల్ కట్టని వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్…!
ప్రధానాంశాలు:
Electricity Bill : గృహజ్యోతి కరెంట్ బిల్ కట్టని వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్...!
Electricity Bill : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో గృహజ్యోతి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన అందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. ఇక ఈ పథకానికి రాష్ట్ర ప్రజలు నమోదు చేసుకోవడం ద్వారా చాలామంది ఉచిత విద్యుత్ ను పొందగలుగుతున్నారు .దీంతో ప్రస్తుతం చాలామందికి 10% అదనం కలిపి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందుతుంది. దీంతో రాష్ట్రంలోని చాలామందికి 0 విద్యుత్ బిల్లు వస్తుంది. అదనపు విద్యుత్ వినియోగిస్తే మాత్రం మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ముందే తెలియజేసింది.
Electricity Bill : బ్యాలెన్స్ ఉన్న బిల్లు చెల్లించారా…?
అయితే ప్రస్తుతం వేసవికాలం కావడంతో చాలామంది అదనంగా విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో చాలామంది 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ బిల్లును గడువు తేదీ ముగిసేలోపు చెల్లించ లేకపోతే గతంలో జరిమానా విధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ గృహ జ్యోతి పథకంలో భాగంగా మర్చి నెలలో అదనపు విద్యుత్తు వాడిన వారు మొత్తం బిల్లును గడువు ముసేలోపు చెల్లించకపోతే ఎలాంటి జరిమానా విధించబడదు. దీంతో మీరు బిల్లును లేటుగా కట్టిన సరే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Electricity Bill : గృహజ్యోతి కరెంట్ బిల్ కట్టని వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్…!
Electricity Bill : ఈ నిర్ణయం ఎందుకంటే…
అయితే బె స్కామ్ సాఫ్ట్ వేర్ అప్డేట్ కారణంగా మార్చి 10 నుండి మార్చి 19 వరకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఆన్లైన్ సేవలు అందుబాటులో లేవు. ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం వలన కొంతమంది వినియోగదారులు విద్యుత్ బిల్లును చెల్లించలేకపోయారు. దీంతో కరెంటు బిల్లు చెల్లింపులలో జాప్యం జరిగిన జరిమానా తప్పదని విద్యుత్ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వలన మార్చి 20 నుండి పునరుద్ధరించబడ్డాయి. కావున ఇప్పుడు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
Electricity Bill : నమోదు చేసుకొని వారు ఉంటే చేసుకోవచ్చు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ గృహ జ్యోతి యోజన పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందాలి అనుకునేవారు ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి ఇంకా గడువు ఉండటం వలన ఉచిత విద్యుత్ సౌకర్యం లేనివారు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. దీనికోసం మీరు మీ సమీప ప్రాంతంలో గల వివిధ సేవా కేంద్రాలలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.