Telangana Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. పే స్కేల్ అమలుకు సంబంధించి కీలకమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సెర్ప్ ఉద్యోగుల కనిష్ట పేస్కేల్ ₹19,000 నుంచి ₹58,850 లు కాగా గరిష్ట పే స్కేల్ ₹51,320, ₹1,27,310 లుగా నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పే స్కేల్ వర్తించనుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామీణభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఆల్రెడీ ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నాలుగు వేల మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేయకురాండగా.. ప్రభుత్వంపై ఏటా ₹42 కోట్లు అదనపు భారం పడనుంది. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం జీతం రూపంలో ఏట 192 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో తాజా ఉత్తర్వులు మేరకు ప్రతి ఏటా ₹234కోట్ల చెల్లించనున్నారు. సెర్ప్ ఉద్యోగులు చాలా వరకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటంతో పాటు వారిని చైతన్య పరచడం బ్యాంకుల రుణాలు ఇప్పించటం లో కీలక పాత్ర పోషిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. వచ్చే నెల నుండి పే స్కేల్ అమలు చేయటానికి నిర్ణయం తీసుకున్నందుకు సెర్ప్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు.