అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి : హైకోర్టు ఆగ్రహం
Telangana High court : తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు తీవ్రతరంగా మారిపోతున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ (అల ) అనే దానికంటే కరోనా సునామీ అని పిలవాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఎందుకో అలసత్వంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో హైకోర్టు Telangana High court కలగచేసుకొని 48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ ప్రకటించాలని హెచ్చరించటంతో ఉలిక్కిపడ్డ కేసీఆర్ సర్కార్ వెంటనే రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది.
మరోసారి హైకోర్టు తెలంగాణ సర్కార్ పై సీరియస్
తాజాగా మరోసారి Telangana High court హైకోర్టు తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ మీరు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూతో పాటు అన్ని సమావేశాలు, వేడుకలను 50 శాతం కుదించాలని ఆదేశించింది. అంబులెన్స్ డ్రైవర్లు చేతివాటానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రాలను వాడాలని ఆదేశించింది.
ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేచి చూడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లకు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు వాయుమార్గాలను సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది.ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా చికిత్సను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని… తద్వారా కోవిడ్ సెంటర్లపై ఒత్తిడిని తగ్గించాలని ఆదేశించింది. పోలీసులకు కూడా మాస్క్ కంపల్సరీ చేయాలని చెప్పింది. పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది. కోర్టు మొట్టిక్కాయలు వేస్తేకాని తెలంగాణ సర్కార్ లో కదలిక రాకపోవటం ఏమిటో అర్ధం కానీ విషయం. మున్ముందు ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజాకోర్టులో కూడా శిక్ష తప్పకపోవచ్చని అంటున్నారు. మరిన్ని తాజా Telugu News కోసం మా సైట్ ఫాలో అవ్వండి