Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు ఈరోజు (మంగళవారం) తుది తీర్పు వెల్లడించింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ, పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)ను ఆదేశించింది.

#image_title
హైకోర్టు కీలక ఆదేశాలు
గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేయాలి
అన్ని పేపర్లను తిరిగి రీవాల్యుయేట్ చేయాలి
రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షను తిరిగి నిర్వహించాలి
రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలను ప్రకటించాలి
వివాదం ఎలా మొదలైంది?
2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో వాల్యుయేషన్ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు ఆరోపించారు. ఈ అంశంపై సిద్దిపేటకు చెందిన కె. పర్శరాములుతో పాటు మరికొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ తీర్పుతో అభ్యర్థులు మళ్లీ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకోగా, మళ్లీ రీవాల్యుయేషన్ లేదా పరీక్ష రద్దు జరిగితే, నియామక ప్రక్రియలో ఆలస్యం తరం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు.