Inter Exams | తెలంగాణ ఇంటర్ పరీక్షలకి టైం ఫిక్స్.. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయా?
Inter Exams |తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే టైమ్ టేబుల్ ను ఇంటర్ బోర్డు సర్కారుకు ఆమోదం కోసం పంపింది. త్వరలో పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయబడనుంది.
#image_title
ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు:
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రారంభించింది.
పరీక్ష షెడ్యూల్ నేపథ్యం:
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి.
ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే, విద్యార్థులు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్ వంటి entrance exams కోసం సమయం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.
గత సంవత్సరం మార్చి 5న పరీక్షలు ప్రారంభమైనప్పుడు జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2 నుంచి ఉండడంతో గ్యాప్ తక్కువగా ఉండటంతో స్టూడెంట్స్ ఒత్తిడికి గురయ్యారు.
తెలంగాణలో 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు.
పరీక్ష ఫీజు పెంపు ప్రతిపాదన:
ప్రాక్టికల్స్ ఉండని కోర్సులకు ప్రస్తుత ఫీజు ₹520.
ఎంపీసీ, బైపీసీ, జువాలజీ వంటి కోర్సులు, ఒకేషనల్ కోర్సులకు ₹750.
కొత్త ప్రతిపాదన ప్రకారం: ప్రాక్టికల్స్ లేకుండా కోర్సులు ₹600, ప్రాక్టికల్స్ ఉన్న కోర్సులు ₹875 ఫీజు విధించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే ఈ మార్పు అమల్లోకి రానుంది.