Telangana Jobs : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Jobs : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Jobs : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!

Telangana Jobs : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాలలో దాదాపు 5,348 పోస్టులను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్స్ లు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్స్ ,ANM , బయో మెడికల్ ఇంజనీర్లు , బయో మెడికల్ టెక్నీషియన్ , ఆడియో విజువల్ టెక్నీషియన్స్ , జూనియర్ సిటీ స్కాన్ టెక్నీషియన్ , డెంటల్ హైజెనిస్ట్ , ఈసీజీ టెక్నీషియన్ , ఈఈజి టెక్నీషియన్ , లెక్చరర్ , రేడియోగ్రాఫర్ , మౌల్డ్ టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు అన్నీ కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ , తెలంగాణ వైద్య విధాన పరిషత్ , తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ , ఐపిఎం , ఆయుష్ ,MNJ క్యాన్సర్ ఆసుపత్రి , ఔషధ నియంత్రణ మండలి వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.వీటిలో అత్యధికంగా వైద్య విధానం పరిస్థితుల్లో 3,235 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనితోపాటు కొత్త వైద్య కళాశాలలో అలాగే బోధనాస్పత్రులలో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికంగా 1988 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు , 1014 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు , 764 ల్యాబ్ టెక్నీషియన్స్ , 596 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ,192 ఫార్మాసిస్టుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ వైద్య సేవల నియామక బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కూడా అనుమతించటం జరిగింది. ఈ మేరకు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కావున ఈ పోస్టును భర్తీ చేసేందుకు త్వరలోనే మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. కాబట్టి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోగలరు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది