KCR : కేసీఆర్ జాతీయ రాజకీయం ఏమో కాని.. రాష్ట్రంలో వ్యతిరేకత
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ 2024 లో జరుగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రేసేతర కూటమిని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ అందులో భాగంగా కాళ్లకు చక్రాలు కట్టుకుని అన్నట్లుగా తిరిగేస్తున్నాడు. తాజాగా ఆయన దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యేందుకు వారం రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. రాజకీయ పర్యటనలు చేయడం సరే కాని ఆ సమయంలో ఆయన చేసిన పనితో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.
కేసీఆర్ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయంను పంజాబ్ ముఖ్యమంత్రితో కలిసి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో దేశ వ్యాప్తంగా పర్యటించడం ఎంత వరకు సబబు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని కేసీఆర్.. యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని కేసీఆర్ పంజాబ్.. ఢిల్లీ వెళ్లి అక్కడి రైతుల కోసం ఆర్థిక సాయం అందించడం విడ్డూరంగా ఉందంటూ విపక్ష పార్టీ లతో పాటు సాదారణ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

KCR heavy raiTelangana people angry on cm kcr India tourn damage newly built yadadri temple
కేసీఆర్ వ్యవహార శైలి ఏమాత్రం సరిగా లేదంటూ వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి చాలదు అన్నట్లుగా కోట్లకు కోట్లు దాన ధర్మాలు చేయడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ఈ విషయమై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర యువతకు లేదా రైతులకు లేదంటే మరేదైనా రంగం వారికి ఆ డబ్బును అదే తరహాలో ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది కదా.. జాతీయ మీడియాలో పబ్లిసిటీ కోసం అన్ని కోట్లకు కోట్లు ఖర్చు చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. అక్కడ రైతులకు సాయం చేయడం వల్ల జాతీయ స్థాయిలో వచ్చే రాజకీయ ప్రయోజనం ఎంతో తెలియదు.. కాని ఇక్కడ మాత్రం పరిస్థితి జటిలం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.