Thaman | సచిన్ టెండూల్కర్ నుంచి ప్రశంసలు అందుకున్న తమన్ ..ఆనందానికి అవధులే లేవు!
Thaman | ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రయాణించడం కలగా ఉంది. డాలస్ నుంచి దుబాయ్‌కు వెళ్లే విమానంలో సచిన్ పక్కనే కూర్చోవడం తమన్ ఎప్పుడు మరిచిపోలేడు. ఈ ఆసక్తికర సంఘటనను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, సచిన్‌తో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. “డాలస్ నుంచి దుబాయ్ వరకు లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో ప్రయాణించాను.
#image_title
రేర్ మూమెంట్..
ఈ ప్రయాణంలో నాకు అమూల్యమైన సమయాన్ని గడిపే అవకాశం వచ్చింది. సీసీఎల్ మ్యాచ్‌లలో నా బ్యాటింగ్ వీడియోలు ఆయనకు చూపించాను. అవి చూసిన సచిన్ ‘మీ బ్యాట్ స్పీడ్ బాగా ఉంది’ అంటూ ప్రశంసించారు. ఇది నా జీవితంలోని గొప్ప క్షణం” అంటూ తమన్ ఆనందంగా పేర్కొన్నారు.
తమన్‌కు సంగీతంతో పాటు క్రికెట్ అంటే అపారమైన మక్కువ ఉంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) లో తెలుగు వారియర్స్ తరఫున ఆడుతూ ఎన్నో మ్యాచ్‌ల్లో విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌గా ఆయనకి పేరుంది. స్టూడియో సిబ్బందితో తరచూ క్రికెట్ ఆడతారని, ఆటపై ఆయన అభిమానం గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి సంగీతం అందించి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మార్చిన తమన్, ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ‘ఓజీ’లో తమన్ సంగీతం సినిమా విజయానికి కీలక కారణమైందని దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా అభినందించారు.