Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..!

Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న స‌చిన్ క్రికెట్‌లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసాడో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే సచిన్‌ తెందుల్కర్‌లో మరో కోణం కూడా ఉంది. అటవీ జంతువులన్నా ముఖ్యంగా పులుల పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు. నాగ్‌పూర్‌లోని తాడోబా టైగర్‌ రిజర్వ్‌ పార్క్‌లో ఒక‌సారి త‌న కుటుంబసభ్యులతో పర్యటించారు స‌చిన్. పులులతో గడిపిన క్షణాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..!

Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న స‌చిన్ క్రికెట్‌లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసాడో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే సచిన్‌ తెందుల్కర్‌లో మరో కోణం కూడా ఉంది. అటవీ జంతువులన్నా ముఖ్యంగా పులుల పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు. నాగ్‌పూర్‌లోని తాడోబా టైగర్‌ రిజర్వ్‌ పార్క్‌లో ఒక‌సారి త‌న కుటుంబసభ్యులతో పర్యటించారు స‌చిన్. పులులతో గడిపిన క్షణాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయగా దానికి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా తడోబా అభయారణ్యంలో స‌చిన్ కుటుంబ సమేతంగా పర్యటించారు. భార్య అంజలి, సోదరి, మరో మాజీ క్రికెటర్‌ ప్రశాంత్‌ వైద్య, ఇతర మిత్రులతో కలసి, ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లారు. అనంత‌రం తాడోబా అంధారి టైగర్ వెళ్లారు. . తొలిసారిగా 2020 జనవరి 26న భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో, ఆ త‌ర్వాత న తన తల్లి, మిత్రులతో వెళ్లారు.

Sachin Tendulkar పులులు సంర‌క్షించాలి..

మూడు జ‌న‌రేష‌న్ పులులని కూడా ఆయ‌న చూపించారు.. ప్రపంచ అటవీ జంతువుల దినోత్సవం 2021 సందర్భంగా , తాడోబా అభయారణ్యంలో పులులతో గడిపిన క్షణాలను వీడియోగా తీసిన సచిన్‌ గతంలో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు ఆ పర్యటన విశేషాలను సచిన్‌ డీటైల్డ్‌గా వివరించారు.ఈ రోజు అంత‌ర్జాతీయ పులుల సంద‌ర్భంగా స‌చిన్ వీడియో వైర‌ల్ అవుతుంది.ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి. అదే సమయంలో పులుల దాడిలో 349 మంది మరణించారు, ఒక్క మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి.

Sachin Tendulkar పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌ వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్

Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..!

ఉత్తరప్రదేశ్‌లో పులుల దాడిలో 59 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 27 మంది మరణించారు. భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది. ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 75 శాతం భారత్ లోనే ఉన్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి భారతదేశం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. మొదట 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను కవర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో 78,735 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా 55 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది