Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. సచిన్ రికార్డు సమం.. బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్ అంటున్న క్రికెట్ ఫ్యాన్స్ | The Telugu News

Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. సచిన్ రికార్డు సమం.. బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్ అంటున్న క్రికెట్ ఫ్యాన్స్

Virat Kohli : విరాట్ కోహ్లీ.. ఈరోజు ఆయన పుట్టిన రోజు. బర్త్ డే అంటే ఆరోజు ఏదైనా ఎప్పటికీ గుర్తుండేలా పని చేయాలని అందరూ అనుకుంటారు. విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచం అంతా గుర్తుంచుకునే పని చేశాడు. కోల్ కతాలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డ్ వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ చేసి రికార్డు సాధించాడు. తన వన్డేల్లో ఇది 49వ సెంచరీ. ఇప్పటి వరకు వన్డేల్లో 49 సెంచరీలు చేసి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 November 2023,5:59 pm

ప్రధానాంశాలు:

  •  పుట్టిన రోజుకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

  •  కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు

  •  ఈ మ్యాచ్ లో 101 పరుగులు చేసి సరికొత్త రికార్డ్

Virat Kohli : విరాట్ కోహ్లీ.. ఈరోజు ఆయన పుట్టిన రోజు. బర్త్ డే అంటే ఆరోజు ఏదైనా ఎప్పటికీ గుర్తుండేలా పని చేయాలని అందరూ అనుకుంటారు. విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచం అంతా గుర్తుంచుకునే పని చేశాడు. కోల్ కతాలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డ్ వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ చేసి రికార్డు సాధించాడు. తన వన్డేల్లో ఇది 49వ సెంచరీ. ఇప్పటి వరకు వన్డేల్లో 49 సెంచరీలు చేసి రికార్డు సాధించాడు సచిన్ టెండుల్కర్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరూ వన్డే కెరీర్ లో 49 సెంచరీలు చేయలేదు. ఆ రికార్డును ఇప్పుడు విరాట్ కోహ్లీ సమం చేశాడు. దీంతో ఇది సరికొత్త చరిత్రకు నాంది అని భారత్ క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

120 బంతుల్లో కోహ్లీ 100 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు కొట్టాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ గెలుస్తూ వచ్చింది. 7 మ్యాచ్ లలో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా పెద్ద ఫరక్ పడదు కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం, అది కూడా తన పుట్టిన రోజు నాడు సెంచరీ చేయడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేవు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకొని తన ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా ముగించింది. 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...