Thatikonda Rajaiah : ఏంది రాజ‌య్య ఇది..! గర్భిణీ మహిళలకు కేసీఆర్ భ‌ర్త లాంటి వాడా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Thatikonda Rajaiah : ఏంది రాజ‌య్య ఇది..! గర్భిణీ మహిళలకు కేసీఆర్ భ‌ర్త లాంటి వాడా..?

Thatikonda Rajaiah తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ KCR సర్కారు కొలువు తీరిన వేళ.. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన నేతల్లో రాజయ్య ఒకరు. అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించటం.. దీనిపై దళిత సంఘాలు.. నేతలు.. పలువురు మేధావులు అదే పనిగా విరుచుకుపడటం.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఒకదశలో ముందస్తు ఎన్నికలు జరిగిన 2018లో రాజయ్యకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న వాదన వినిపించినా.. అందుకు […]

 Authored By sukanya | The Telugu News | Updated on :4 October 2021,11:25 am

Thatikonda Rajaiah తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ KCR సర్కారు కొలువు తీరిన వేళ.. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన నేతల్లో రాజయ్య ఒకరు. అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించటం.. దీనిపై దళిత సంఘాలు.. నేతలు.. పలువురు మేధావులు అదే పనిగా విరుచుకుపడటం.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఒకదశలో ముందస్తు ఎన్నికలు జరిగిన 2018లో రాజయ్యకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న వాదన వినిపించినా.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇచ్చారు.

Thatikonda Rajaiah coments viral


Thatikonda Rajaiah coments viral

అంచనాలకు తగ్గట్లే ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ రాజయ్యకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. అప్పటి నుంచి తనకంటూ పదవి కోసం రాజయ్య పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ రాజయ్యకు కాలం కలిసి రావటం లేదు. తనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన వేళలో.. కేసీఆర్ మీద గుర్రు ప్రదర్శించిన రాజయ్య.. ఆ తర్వాతి కాలంలో సారు పెద్ద మనసు చేసుకొని తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు షురూ చేశారు.

Thatikonda Rajaiah భర్త కూడా కేసీఆరే..?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అనుకోని దెబ్బ పడింది. కేసీఆర్ మనసున్న మారాజు అంటే పొగడ్తల వర్షం కురిపించసాగారు. అధినేతను అదే పనిగా పొగిడే పనిలో భాగంగా ఆయన నోటి నుంచి అనుకోని రీతిలో రాకూడని మాట వచ్చేసింది. దీనికి లింగాలఘణపురం మండల కేంద్రం వేదికైంది.

kcr

kcr

ఇంతకీ తాటికొండ రాజయ్య ఏమన్నారన్నది ఆయన నోటి మాటల్లోనే చెబితే.. ”సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు.ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు బట్టలు సర్వం అందిస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆడపిల్లకు అమ్మ.. నాన్న.. అత్త.. మామ అవుతున్నాడు అన్న వరకు ఓకే. కానీ.. భర్త కూడా అయినే అయిపోతున్నాడంటూ నోరు జారిన వైనం వివాదంగా మారింది. ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది