TDP – Janasena : ఎట్టకేలకు కుదిరిన సీట్ల సర్దుబాటు…కూటమి మొదటి మెట్టు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP – Janasena : ఎట్టకేలకు కుదిరిన సీట్ల సర్దుబాటు…కూటమి మొదటి మెట్టు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :28 January 2024,9:00 pm

TDP – Janasena : ఎట్టకేలకు కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొల్లిక్కి వచ్చింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ 114 స్థానాలు జనసేన పార్టీ 61 స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ సమావేశాలలో సీట్ల కేటాయింపు పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 5 స్థానాలలో టిడిపి పోటీ చేయనుండగా 3 స్థానాలలో జనసేన పోటీ చేయబోతుంది.

ఇక విజయనగరం జిల్లాలోని బొబ్బిలి , చీపురుపల్లి , విజయనగరం , శృంగవరపు కోట స్థానాలలో టిడిపి పోటీ చేయనుండగా రాజం ,గణపతి నగరం , నెల్లిమర్ల ప్రాంతాలలో జనసేన పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో , కురుపామ్, పార్వతీపురం , సాలూరులో టిడిపి పోటీ చేస్తుంటే పాలకొండ నుండి జనసేన పోటీ చేయనుంది. అలాగే విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖపట్నం , పశ్చిమ , గాజువాక నుంచి జనసేన , మిగతా స్థానాలైన , విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణంలో టిడిపి పోటీ చేయనున్నాయి.

ఇక సీతారామరాజు జిల్లాలో పాడేరు నుండి జనసేన అరకు రంపచోడవరం నుండి టిడిపి పోటీ చేస్తాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో చోడవరం పెందుర్తి ఎలమంచిలి నుంచి జనసేన పోటీ చేయనుండగా మాడుగుల పాయకరావుపేట నర్సీపట్నం నుండి టిడిపి పోటీ చేయదలుచుకున్నాయి.

కాకినాడ జిల్లాలో తుని పెద్దాపురం జగ్గంపేట నుండి టిడిపి మరియు పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ నుండి జనసేన బరిలో నిలబడుతున్నాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం గన్నవరం మండపేట నుండి టిడిపి పోటీ చేస్తుంటే ముమ్మిడివరం అమలాపురం రాజోలు కొత్తపేట నుండి జనసేన పోటీ చేయదలుచుకున్నాయి.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ అనపర్తి గోపాలపురం నిడదవోలు నుండి టిడిపి బరిలొ దిగుతుంటే , రాజానగరం రాజమండ్రి రూరల్ కొవ్వూరు నుండి జనసేన పోటీ చేయనున్నాయి.

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట పాలకొల్లు నుండి టిడిపి నరసాపురం భీమవరం తునుకు తాడేపల్లిగూడెం నుండి జనసేన పోటీ చేయనున్నాయి.

అదేవిధంగా ఏలూరు జిల్లాలో దెందులూరు నూజివీడు కైకలూరు చింతలపూడి నుండి టిడిపి బరిలో నిలబడితే ఉంగుటూరు ఏలూరు పోలవరం నుండి జనసేన పోటీ చేస్తాయి.
ఇక కృష్ణాజిల్లా నుంచి పినమాలూరు మచిలీపట్నం అవనిగడ్డ గుడివాడ గన్నవరం నుంచి జనసేన పోటీ చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా నుంచి మైలవరం నందిగామ జగ్గయ్యపేట విజయవాడ వెస్ట్ తిరువూరు
టిడిపి పోటీ చేస్తుండగా విజయవాడ మధ్య విజయవాడ తూర్పు నుంచి జనసేన పోటీ చేయనున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలో గురజాల మాచర్ల వినుకొండ చిల్లకల్లూరిపేట పెదకూరపాడు నుండి టిడిపి పోటీ చేయనుండగా నాసబ్ నరసరావుపేట సత్తుపల్లి నుంచి జనసేన పోటీ చేస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లా లో పొన్నూరు మంగళగిరి తాడికొండ గుంటూరు తూర్పు నుంచి టిడిపి పోటీ చేస్తున్నాయి. గుంటూరు పశ్చిమ పత్తిపాడు తెనాలి నుంచి జనసేన పోటీ చేస్తున్నాయి. అలాగే బాపట్ల జిల్లాలో పర్చూరు రేపల్లె బాపట్ల వేమూరు అద్దంకి నుంచి టిడిపి పోటీ చేయనున్నారు. అలాగే చీరాల నుంచి జనసేన పోటీ చేస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో మర్కపురం కొండేపి ఎర్రగుంటపాలెం కనిగిరి నుంచి టిడిపి పోటీ చేస్తుంది. ఒంగోలు దర్శి గిద్దలూరు సంత నూతలపాడు నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అయితే నంద్యాల జిల్లాలో బనగానపల్లి నంది కొట్టూరు శ్రీశైలం నుంచి టిడిపి పార్టీ పోటీ చేస్తుంది. అయితే నంద్యాల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో మంత్రాలయం పాణ్యం కోడుమూరు పత్తికొండ కర్నూలు ఆలూరు నుంచి టిడిపి పార్టీ పోటీ చేస్తున్నారు. ఇక ఆదోని నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అలాగే కడప జిల్లాలో పులివెందుల కమలాపురం బద్వేలు కడప పొద్దుటూరు జమ్మలమడుగు నుంచి టిడిపి పోటీ చేస్తాయి అలాగే మైదుకూరు జిల్లా నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో గుంతకల్లు ఉరవకొండ తాడిపత్రి రామదుర్గం నుంచి టిడిపి పోటీ చేయనుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది