Beggar buy the iPhone : చిల్లరతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు.. ఆశ్చర్యపోయిన ఓనర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beggar buy the iPhone : చిల్లరతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు.. ఆశ్చర్యపోయిన ఓనర్

 Authored By kranthi | The Telugu News | Updated on :11 October 2023,8:00 pm

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వంటల దగ్గర నుంచి టూరిజం వరకు అన్ని రకాల వీడియోలు నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇక వీటితోపాటు ఫ్రాంక్ వీడియోలు సైతం యూట్యూబ్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి ఫ్రాంక్ వీడియో ఒకటి ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ నడుస్తుంది. ఐఫోన్ 15 అంశంగా తీసుకొని ఫ్రాంక్ వీడియోను రూపొందించారు. ఈ ఐఫోన్లను కొనాలని చాలామందికి ఉంటుంది కానీ సామాన్య ప్రజలకు ఇంత ఖరీదు గల ఫోనులు కొనడం అసాధ్యం.

సాధారణంగా అయితే ఐఫోన్లను చాలా డబ్బున్న వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. లక్ష రూపాయల ఫోను కొనుగోలు చేయాలంటే ఆమాత్రం ఉండాలి. అయితే ఒక బిచ్చగాడు ఐఫోన్ కొనుగోలు చేయడానికి షాప్ కి వచ్చాడు. అంతేకాదు అతడు చిల్లర డబ్బులు అంతా ఒక బస్తాలో వేసుకొని వస్తాడు. దీంతో షాపు ఓనర్ షాకింగ్ కి గురవుతాడు. అయితే కింగ్ ఆఫ్ ఎక్స్పరిమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ఫ్రాంక్ వీడియోను చేశారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి బిచ్చగాడు వేషం వేసుకొని మొదటగా జోద్పూర్ లో గల కొన్ని మొబైల్ షాప్ లకు తిరిగాడు. అయితే దుకాణదారులు, యజమానులు అతడిని లోపలికి రానివ్వలేదు.

Beggar buy the iPhone

#image_title

మరికొందరు మాత్రం చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. అయితే చివరికి ఓ షాపు యజమాని ఐఫోన్ ఇవ్వడానికి అంగీకరించాడు. బిచ్చగాడు వేషంలో ఉన్న వ్యక్తి తీసుకొచ్చిన చిల్లరను తీసుకొని ఐఫోన్ ఫోన్ ను అందించాడు. షాప్ లో పని చేసే వాళ్లంతా ఆ చిల్లరంతా లెక్క పెట్టారు. దీనంతటిని వీడియో తీశారు. ఫోను కొనుగోలు పూర్తి అయిన తర్వాత తను బిచ్చగాడు కాదని ఫ్రాంక్ వీడియో అని చెప్పేసాడు. దీంతో షాప్ యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=eqeToEmVLtc

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది