Onions | ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు.. సింపుల్ ట్రిక్ తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Onions | ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు.. సింపుల్ ట్రిక్ తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :19 September 2025,8:00 am

Onions | వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయలు ముందుంటాయి. వంటకు రుచి, సువాసన తెచ్చే ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం సహజం. ప్రతి సారి ఇలా జరగడం వంట చేసే వారిని ఇబ్బందిపెడుతుంది. అయితే నిపుణులు చెబుతున్న చిన్న ట్రిక్ పాటిస్తే ఇకపై ఉల్లిపాయలు కోసేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా కారదట.

#image_title

ఈ టిప్స్ పాటించండి..

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు గాలితో కలిసినప్పుడు కళ్ళలో మంట కలిగించే వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీంతో కళ్ళలో మంట, నీరు రావడం జరుగుతుంది. కానీ దీనికి సులభమైన పరిష్కారం ఉంది. వంట నిపుణుల సూచన ప్రకారం, ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసి 5 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని 10 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల కోసేటప్పుడు సల్ఫర్ వాయువులు తక్కువగా విడుదలవుతాయి. దీంతో కళ్లలో మంట రాదు, కన్నీళ్లు కారవు. అందువల్ల ఇకపై వంట చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇబ్బంది లేకుండా పనిని పూర్తి చేసుకోవచ్చు. వంట చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ చిన్న చిట్కా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది