చైనాలో తగ్గుతున్న జనాభా… అనేక చర్యలకు దిగుతున్న చైనా సర్కార్
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉన్నా విషయం అందరికి తెలిసిందే, ఆ తర్వాత స్థానంలో మన దేశం ఉంది. గత కొన్ని దశాబ్దాల నుండి చైనా జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉండటంతో అక్కడి పాలకులు ఆలోచనలో పడ్డారు. మరి కొన్ని సంవత్సరాలు ఇదే విధంగా ఉంటే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆ దేశ ప్రభుత్వం భావించింది.
నిబంధనలు షురూ
దీనితో జనాభా పెరుగుదలను అరికట్టటానికి రంగంలోకి దిగినా చైనా ప్రభుత్వం పెళ్లైన ఒక్కో జంటకు ఒక్క సంతానం మాత్రమే ఉండాలని 1970 లో నిబంధన విధించింది. అయితే ఈ నిబంధన వలన దేశ జనాభా వృద్ధి రేటు తగ్గిన కానీ, మరో సమస్యా వచ్చింది. లింగ బేధం చాలా స్థాయిలో పెరిగింది. ఫలితంగా మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. పైగా జనాభా తగ్గువ ఉండటం, మెరుగైన వైద్య సేవలు ఉండటంతో మనిషి సగటు జీవన వయస్సు పెరగటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరిగింది. దీని వలన యువ శ్రామిక శక్తి చైనాలో తగ్గు ముఖం పట్టింది.
ఒకరు వద్దు ఇద్దరు ముద్దు
దేశం అభివృద్ధి చెందాలంటే కార్మిక శక్తి అనేది చాలా అవసరం, ఈ కోణంలో చూస్తే చైనా ఆ విషయంలో వెనకబడి ఉండటంతో 1970 లో ప్రవేశపెట్టిన ఒక జంటకు ఒక్క సంతానం అనే నిబంధనను సవరించి, ఇద్దరు సంతానం ఉండవచ్చు అంటూ 2016 లో సవరణ చేసింది, కానీ దాని వలన ఎలాంటి ఫలితం ఉండటం లేదు. మారిన జీవన విధానం కావచ్చు. యువ భార్యాభర్తల మధ్య ఉంటున్న అవగాహనా కావచ్చు, పెరిగిన కుటుంబ ఖర్చులు కావచ్చు, జంటలు ఒక్క సంతానానికే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న చైనా మహిళలు పిల్లలను కనటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అక్కడి సర్వేలు చెపుతున్నాయి.
అక్కడ ఏడాదికి ఏడాదికి శిశువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కరోనా వలన తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు వలన ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. 2025 నాటికీ చైనా లో పదవి విరమణ చేసిన వాళ్ళ సంఖ్య దాదాపుగా 30 కోట్లు వరకు ఉంటుంది. ఈ కోణంలో చూస్తే యువతరం సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ప్రతి దేశంలో కూడా మానవ వనరులే సహజ సిద్దమైన ఆస్తులుగా చూస్తారు.. ఆ విషయంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి ఈ విషయంలో భారతదేశం ఆదర్శంగా ఉంది. ఇక చైనా లో ఈ ఏడాది చివరిలో జనాభా లెక్కలు మొదలుకాబోతున్నాయి. ప్రతి పదేళ్లకు ఒక్కసారి అక్కడ జనాభా లెక్కలు జరుగుతాయి. అవి పూర్తి అయితే కానీ అన్ని విషయాలు తెలియవు.