తన వయసు 39 ఏళ్లే.. కానీ పిల్లలు మాత్రం 44 మంది.. అంతమందిని ఎలా కన్నదో తెలిస్తే నోరెళ్లబెడతారు?
ఈరోజుల్లో ఇద్దరు పిల్లలను కనడమే ఎక్కువ. కొందరైతే ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ కన్నారంటే.. వాళ్లను పెంచి పోషించడం ఈరోజుల్లో అంత ఈజీ కాదు. అందుకే.. అందరూ ఒకరు లేదా ఇద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. నేటి జనరేషన్ లో ధరలు అమితంగా మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఎక్కువే. అందుకే.. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా మారింది నేటి జనరేషన్. అయితే.. ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనం చిన్న కుటుంబానికి విరుద్ధం. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. పెద్ద అంటే.. మామూలు పెద్ద కాదు.. ఆ మహిళ ఏకంగా 44 మంది పిల్లలను కన్నది. షాక్ అయ్యారా? ఆమె వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి. 44 మంది పిల్లలను కన్నా ఆ మహిళ వయసు ఇప్పటికీ 39 ఏళ్లే. నమ్మలేకపోతున్నారా? పదండి.. ఓసారి ఉగాండాకు వెళ్లొద్దాం.

woman has 44 childen in 39 years in uganda
ఆమె పేరు నబతంజి. ఊరు ఉగాండా. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే.. తన పిల్లలకు రోజూ అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉంది. ఎందుకంటే.. తనకు ఉన్నది ఇద్దరు ముగ్గురు పిల్లలు కాదు.. 44 మంది. తనకు 12 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి అయింది. అంటే 12 ఏళ్ల నుంచే తను పిల్లలను కనడం స్టార్ట్ చేసింది. మొదటి కాన్పులోనే తనకు నలుగురు పిల్లలు పుట్టారు. రెండో కాన్పులో నలుగురు, మూడో కాన్పులో నలుగురు, అలా ప్రతి కాన్పుకు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు జన్మించారు తనకు. అలా.. మొత్తం 44 మంది పిల్లలకు తల్లి అయింది ఆ మహిళ.
ఆమెకు ఇప్పుడు 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆయనే అందరికన్నా పెద్ద కొడుకు. ప్రస్తుతం తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తనకు 23 ఏళ్ల వయసు వచ్చే సరికే.. 25 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఆ మహిళ. తన భర్త కూడా ఇఫ్పుడు తన వద్ద లేడు. కొన్నేళ్ల క్రితమే పిల్లలను సాదలేక వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలను పెంచడం తనకు భారంగా మారింది. తను చేయని పని లేదు. ఎంత చేసినా.. పిల్లలకు రోజూ మూడు పూటల తిండి మాత్రం పెట్టలేకపోతోంది.

woman has 44 childen in 39 years in uganda
అంతమంది పిల్లలను కనడానికి కారణం ఏంటి?
తను అంతమంది పిల్లలను కనడానికి ఓ కారణం ఉంది. తనకు మామూలుగా ఆడవాళ్లకు అండాశయం ఉండే చోట కాకుండా.. తనకు వేరే చోట ఉండటమే కాకుండా.. అది పెద్దదిగా ఉంది. దీంతో తన భర్తతో కలిసినప్పుడు తనకు ఎక్కువ పిండాలు అందులో వృద్ధి చెందేవి. అలాగే.. తను పిల్లలు వద్దని అబార్షన్ చేయించుకోవాలనుకున్నా అదీ కుదరలేదు. ఎందుకంటే.. తన గర్భాశయంలో ఉన్న సమస్యల వల్ల తను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నా.. అబార్షన్ చేయించుకున్నా.. తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారట. దీంతో… తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా.. పిల్లలను కనడం తప్పితే తనకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. అలా.. 44 మంది పిల్లలకు తల్లి అయింది అన్నమాట.
ఇది కూడా చదవండి ===> తాళి కడుతుండగా వధువు మృతి.. అయినా పెళ్లి మాత్రం జరిగింది…!