Viral Video : పాముపై కప్పు సూపర్ రైడింగ్.. చివరికి ఏమి జరిగిందంటే..?
Viral Video : కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే సామెత మనం వింటూనే ఉంటాం.. కప్పు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో పాము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పైగా కప్పులు ఎక్కడ ఉన్నాయో వెతికిమరి పాములు వెళ్లి కప్పను ఆరగించి వస్తాయి. పైగా తమ జాతి లక్షణం మేరకు కప్పు బెకబెక్ మంటూ అరిస్తే వాటి సౌండ్ ని బట్టి పాములు వేటాడటం జరుగుతుంది.

Viral Video frog super riding on a snake
Viral Video : పాము మీద ఎక్కేసి ఎంచక్కా రైడింగ్
కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియో చాలా విచిత్రంగా ఉంటుంది. కప్పు కనిపిస్తే గుటకేసే దాక వదలని పాము, ఆ కప్పనే తన మీద ఎక్కించుకొని సవారీ చేసింది.. పాము కనిపిస్తే ప్రాణ భయంతో పరుగులు తీసే కప్పు ఏకంగా అదే పాము మీద ఎక్కేసి ఎంచక్కా రైడింగ్ కి వెళ్లిన వీడియోస్ ప్రస్తుత్తం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
IFS ఆఫీసర్ సుశాంత్ నంద తాజాగా విడుదల చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఒకింత ఆశ్చర్యం… ఒకింత ఆనందం, ఒకింత టెన్షన్ అన్నీ కలుగుతున్నాయి. ఆశ్చర్యం ఎందుకంటే… అలా కప్ప… పాముపై వెళ్లడం వల్లే. ఆనందం ఎందుకంటే… తన ఆహారమైన కప్ప తన పైకి ఎక్కి రైడింగ్ చేస్తున్నా… పాము ఏమీ అనకుండా ఊరుకోవడం వల్లే. మరి చివరికి కప్పను పాము తినేసిందా..? లేక పామును బురిడీ కొట్టించి కప్పు ఏమైనా తప్పించుకుందా అనేది మాత్రం తెలియలేదు.
ఏది ఏమైనా పాముపై కప్పు రైడింగ్ వీడియో చుసిన వాళ్ళు మాత్రం కప్పు సామాన్యమైంది కాదంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి
Ride the death…
No excuses, no expectations pic.twitter.com/374y71lYPf— Susanta Nanda (@susantananda3) March 26, 2021