BJP MP : ఆగిపోయిన గుండెను తట్టిలేపిన డాక్టర్.. బీజేపీ ఎంపీ ట్వీట్ వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP MP : ఆగిపోయిన గుండెను తట్టిలేపిన డాక్టర్.. బీజేపీ ఎంపీ ట్వీట్ వైరల్!

 Authored By mallesh | The Telugu News | Updated on :9 September 2022,6:00 pm

BJP MP : వైద్యుడు దేవుడితో సమానం అని చాలా మంది అంటుంటారు.ఎందుకంటే కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి దేవుడే అండగా ఉంటాడని.. వారిని కాపాడుతుంటాడని చాలా మంది నమ్మకం. అలాగే ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి ప్రాణం పోసిన డాక్టర్లను కూడా రోగులు, బాధిత కుటుంబసభ్యులు కూడా దేవుడి లాగా ట్రీట్ చేస్తుంటారు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మా వాళ్లను కాపాడారని చెప్పుకుంటుంటారు.

BJP MP : ఒక్క క్షణంలో ప్రాణం నిలబెట్టాడు

కొందరు వైద్యులు ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. మరికొందరు మాత్రం నిబద్ధతతో వారి వృత్తి ధర్మాన్ని పాటిస్తుంటారు. ఇలా కొందరు సిన్సియర్‌గా వర్క్ చేస్తుండటం వల్లే ఇంకా వైద్యులు అంటే చాలా మంది గౌరవిస్తుంటారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు రోగులు వైద్యులను దేవుడి స్థానంలో ఉంచి కొలుస్తారని.. ఆ వృత్తికి ఎన్నడూ కళంకం తీసుకురావొద్దని కొందరు నేటికి ప్రయత్నిస్తున్నారు.

the doctor who revived the stopped heart bjp mp tweet has gone viral

the doctor who revived the stopped heart bjp mp tweet has gone viral

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి వైద్యుడు అందించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సీపీఆర్ పద్ధతిలో అతనికి పునర్జన్మ నిచ్చిన వైద్యుడిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కొల్హాపూర్‌లోని అర్జున్ అడ్నాయక్ అనే కార్డియాలజిస్ట్‌ను కలవడానికి ఓ పేషెంట్ అతని ఆస్పత్రికి వెళ్లగా.. ఉన్నట్టుండి కూర్చిలో కూర్చున్న రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

వెంటనే గమనించిన వైద్యుడు అతనికి చాతిపై నెమ్మదిగా గుద్దుతూ సీపీఆర్ అందించి అతనికి ప్రాణం పోశాడు. ఈ దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ వీడియోను కొల్హాపూర్ బీజేపీ ఎంపీ ధనుంజయ్ మహదిక్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.విపత్కర సమయంలో స్పందించి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యుడిని నెటిజన్లు కొనియాడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది