Viral video : బ్రిలియంట్.. డాన్స్‌లో ఏకంగా మైకేల్ జాక్సన్‌ను ఫాలో అవుతున్న శునకం
Viral video : యానిమల్స్ ఒక్కోసారి వాటిలో దాగియున్న అద్భుతమైన టాలెంట్‌ను బయట పెడుతుంటాయి. అది చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దీనిలో ఇంత తెలివి ఉందా? అని అనుకుంటారు. ప్రకృతి మనకు ఇచ్చిన అతి విలువైన సంపదలో జంతువులు కీలకం. అవి లేకపోతే నిజంగానే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పెట్స్ చేసే అల్లరి ద్వారా మన మైండ్ రిలీఫ్ అవుతుంది. వాటితో ఆడుకుంటుంటే టైం కూడా తొందరగా గడిచిపోతుంది.ఇంకోక విషయం ఏంటంటే పెట్స్ నమ్మకానికి మారు పేరు. రెండు ముద్దలు వాటికి తిండి పెడితే ఎంతో విశ్వాసంగా ఉండటమే కాదు.
మన మీద ప్రేమను కూడా పెంచుకుంటాయి. వాటి యజమాని ఒక్కసారి కనిపించకపోయే సరికి ఎంతో బాధపడుతాయి. యాజమాని వాటి వెంట ఉంటే అవి చేసే సందడి మామూలుగా ఉండదు. ఇళ్లంతా కలియ తిరుగుతుంటాయి. రాత్రిళ్లు దొంగల నుంచి, ఇతర జంతువుల నుంచి రక్షణగా నిలుస్తాయి. ఇంకా చిన్నపిల్లలతో ఆడుకుంటూ అవి కూడా వారిలాగానే ప్రవర్తిస్తుంటాయి. యజమాని కోసం పనులు కూడా చేసి పెడుతుంటాయి. మార్కెట్‌కు గ్రాసరీ, వస్తువులు అందించే కుక్కల వీడియోలను మనం చూసే ఉంటాం. కానీ, ఓ కుక్క మాత్రం వరల్డ్ డ్యాన్స్ కింగ్ లేట్ ‘మైకేల్ జాక్సన్’ లాగా డ్యాన్స్ చేసేందుకు ఎంతో కష్టపడింది.
Viral video : యజమానులతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాయి..
అందుకు సంబంధించి దృశ్యాలను దాని యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. టీవీలో మైకేల్ జాక్సన్ సాంగ్ పడుతూ డ్యాన్స్ చేస్తుండగా.. డాబర్ మ్యాన్ జాతికి చెందిన ఈ శునకం అచ్చం అతన్ని ఫాలో అయ్యింది. మైకేల్ తిరిగుతూ స్టెప్స్ వేస్తే ఇది కూడా గిర్రున తిరుగుతూ స్టెప్స్ వేసింది. ముందుకు, వెనక్కు రావకడం కాళ్లను ఆడించడం అచ్చం మైకేల్‌ను దింపేసిందటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/_figensezgin/status/1465417723014492173?s=20