Hen Arrest : కోడి అరెస్ట్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…
Hen Arrest : పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారు? సాధారణంగా దొంగతనం చేసిన వారిని, ఇతరులపై దాడి చేసిన వారిని పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేస్తారు. అనుమానంగా కనిపించే వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తారు. ఎందుకుంటే సదరు వ్యక్తి వల్ల ఎవరికైనా అపాయం కలుగుతుందని ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం కామన్.. అలాంటి ఓ రక్షణ ఆఫీస్ వద్ద అనుమానంగా కనిపిస్తే పోలీసులు ఊరుకుంటారా? అయితే మరి పోలీసులు అరెస్టు చేసింది మనిషిని కాదు ఓ కోడిని. ఏంటీ.. కోడిని అరెస్టు చేయడం ఏంటని షాక్ అవుతున్నారు..
మరి అదేగా అసలు ట్విస్టు.. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అసలు విషయం ఏంటంటే..ఎక్కువ సెక్యూరిటీ ఉండే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో ఫుడ్ కోసం ఓ కోడి అటూ ఇటూ తిరిగింది. అది కాస్త పోలీసుల కంట పడింది. అతి ఆ కోడి అనుమాస్పదంగా తిరుగుతుందంటూ పోలీసు ఉన్నతాధికారులు విషయం తెలిసింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని సదరు కోడిని అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.
Hen Arrest : అందుకే అరెస్టు..
షాక్ అయ్యారు కూడా. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు చేస్తే అరెస్టు చేస్తారు కానీ.. ఇలా కోడిని అరెస్టు చేయడం ఏంటని నోరెళ్ల బెడుతున్నారు. అంతే కదా మరి కోడిని అరెస్టు చేయడం ఏంటి వింతగా.. ఇదిలా ఉండగా మరి పోలీసులు మాత్రం తమ భద్రతా విషయాలను అనుగుణంగా కోడిని అరెస్టు చేసినట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా కానీ కోడిని అరెస్టు చేసిన విషక్ష్ం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా..