తెలుగు సీఎంలను జాతీయ మీడియా ఏకి పారేయడానికి కారణం ఏంటో?
తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి గత కొన్నాళ్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు కూడా ఒక పార్టీకి సంబంధించిన మీడియాకు చెందిన సంస్థలు రాస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలకు హైకోర్టు వార్నింగ్ ఇవ్వడం మొదలుకుని అనేక అంశాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని ప్రధానంగా జాతీయ మీడియా హైలైట్ చేస్తూ సీఎంలను ఏకి పారేసే కార్యక్రమం పెట్టుకుంది. చిన్న విషయాన్ని కూడా జాతీయ మీడియా మరీ పెద్దగా చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి.
జగన్ వేదింపులు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీకి చెందిన వారిపై పదే పదే విమర్శలు చేయడంతో పాటు అక్రకమ కేసులు బనాయించి వేదింపులకు గురి చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులకు సంబంధించి హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు దేశం పార్టీ నాయకుల విషయంలో వేదింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. ఇది ఏమాత్రం సబబు కాదంటూ హైకోర్టు మందలించింది.
కేసీఆర్ తీరు సరిగా లేదు..
ఏపీ సీఎం మాదిరిగానే కేసీఆర్ కూడా వేదింపులకు పాల్పడుతున్నాడు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే పలు సార్లు కేసీఆర్ కు అక్షింతలు వేసింది. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచారం చేయడంతో టీఆర్‌ఎస్ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి ఎందుకు జాతీయ మీడియా ఇద్దరు తెలుగు సీఎంలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.