prakasam : యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా
prakasam : ప్రకాశం: ఈత సరదా యువకుడి ప్రాణం తీసింది. మల్లాయ పాలెం గ్రామానికి చెందిన తన్నిరు వెంకటేశ్వర్లు (17) మరో ఇద్దరు మిత్రులు బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కార్వి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. మొదటిగా ముగ్గురు కార్వి లోపలికి దిగారు. లోతు ఎక్కువగా ఉందిని భయపడ్డ ఇద్దరు మిత్రులు బయటకు వచ్చేశారు. లోతు ఎక్కువగా ఉండటం వళ్ల వెంకటేశ్వర్ల నీటి లోపల చిక్కుకుపోయాడు. దీంతో ఇద్దరు మిత్రులు ఇంటికి వచ్చేశారు.
మిత్రుడి మరణంతో భయపడి జరిగిన విషయాన్ని గ్రామంలో ఎవరికీ చెప్పలేదు. రాత్రైనా వెంకటేశ్వర్లు ఇంటికి రావక పోవడంతో వెంకటేశ్వర్లు తండ్రి మిగతా మిత్రులను అడగటంతో గురువారం ఉదయం అసలు విషయం బయటపడింది. వెంటనే మృతుడి త్రండి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కార్వి గుంతలో వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివ నాంచారయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
prakasam : కానిస్టేబుల్ ఇస్లావత్ మార్కండేయనాయక్ సాహసం
వెంకటేశ్వర్లు కార్వి గుంతలో పడ్డాడన్న సమాచారం అందుకున్న బల్లకురవ స్టేషన్ కానిస్టేబుల్ ఇస్లావత్ మార్కండేయ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. సుమారు 40 అడుగుల లోతున్న కార్వి గుంతలోకి దిగడానికి ఎవరూ సాహసిచకపోవడంతో ఇస్లావత్ ధైర్యం చేసి లోపలికి దిగాడు. రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. కానిస్టేబుల్ సాహసాన్ని గ్రామస్తులందరూ అభినందించారు.