Vastu Rules | ఇంట్లో తరచూ గొడవలేనా? వాస్తు చిట్కాలు పాటించకపోతే జరుగుతుంది ఇదే!
Vastu Rules | ఇంట్లో చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతున్నాయా? కుటుంబ సభ్యుల మధ్య అనవసర విభేదాలు, ఉద్రిక్తతలు ఎక్కువైపోతున్నాయా? అయితే ఒక్కసారి ఇంట్లో వాస్తు సరైనదేనా అనే కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు.

#image_title
ఇంట్లో కలహాలు తగ్గించేందుకు పాటించాల్సిన వాస్తు చిట్కాలు:
1. వంటగది స్థానం కీలకం
వాస్తు ప్రకారం వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండాలి. అదే విధంగా గ్యాస్ స్టవ్ కూడా ఆగ్నేయ దిశను ముఖంగా ఉంచేలా వాడాలి. నీటి కుండలు, ఫిల్టర్లు మొదలైనవి ఈశాన్య దిశలో ఉంచితే ఇంట్లో శుభతా, ఆర్థిక ప్రగతి పెరుగుతాయని నిపుణుల అభిప్రాయం.
2. పడక గది – తల దిశ ముఖ్యం
తల భాగాన్ని ఎప్పుడూ దక్షిణ దిశగా ఉంచి నిద్రపోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర దిశగా తల పెట్టి నిద్రపోతే మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
3. ఇంటి మధ్య భాగంలో ఖాళీ స్థలం అవసరం
ఇంటి మధ్య భాగం (బ్రహ్మస్థానం) ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. అక్కడ బరువైన వస్తువులు, అల్మారాలు, కప్పులు ఉంచడం వలన ఇంట్లో గొడవలు, నేచురల్ ఎనర్జీ ఫ్లో బద్ధకమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4. ఇంటి ముందు భాగం శుభ్రంగా ఉంచాలి
ప్రధాన ద్వారం ముందు బూట్లు, చెప్పులు ఉంచకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీకి దారితీస్తుందని చెబుతారు. అలాగే ఇంటి ఎంట్రన్స్ వైపు పగుళ్లు లేకుండా చూడాలి. పచ్చని మొక్కలు ఉంచడం మంచిదంటారు.