Mangal Sutra | మంగళసూత్రానికి సేఫ్టీ పిన్నులు పెడతారా?.. అయితే ఇది తప్పనే అంటున్న పండితులు
Mangal Sutra | హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాధాన్యం అమోఘం. వివాహ సమయంలో కట్టే మంగళసూత్రం భర్త మరియు భార్య మధ్య శాశ్వత బంధానికి, అద్భుతమైన అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. హిందూ సంప్రదాయాల్లో మూడు ముళ్ల తంతు స్త్రీ జీవితంలో అత్యంత పవిత్ర ఘట్టంగా గుర్తించబడుతుంది
#image_title
కారణాలు ఇవే..
ఒకప్పుడు మహిళలు పసుపు దారంతో కూడిన తాళి ధరిస్తుండగా, ఇప్పుడు బంగారు గొలుసును ఎక్కువ మంది తాళిగా ఉపయోగిస్తున్నారు. కారణం పసుపు దారం త్వరగా పాడవ్వడం, మురికి చేరడం వంటివి. అందుకే బంగారు గొలుసు తాళిగా సౌకర్యంగా మారిపోయింది.అయితే తాజాగా పండితులు వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళసూత్రానికి సేఫ్టీ పిన్నులు లేదా ఇనుముతో చేసిన వస్తువులను జత చేయడం శుభంకాదని హెచ్చరిస్తున్నారు. ఇది భర్త పురోగతికి, ఆదాయానికి తీవ్ర ఆటంకం కలిగించవచ్చని వారు చెబుతున్నారు.
సేఫ్టీ పిన్నులు మంగళసూత్రంలో ఉంచడం వలన శుభశక్తులు దూరమై, భర్త ఆరోగ్యంపై, ఉద్యోగ, వ్యాపార ప్రగతిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.ఇనుముతో చేసిన వస్తువులు శని దేవుడికి సంబంధించి నెగటివ్ ఎనర్జీని ప్రతిబింబిస్తాయి. ఇవి మంగళసూత్రానికి జతచేస్తే, దాంపత్య బంధంలో చీలికలు రావచ్చు, ఇంట్లో కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది.