Facial Symptoms | ముఖంపై కనిపించే లక్షణాలు గుండెపోటు సంకేతాలేనా .. వైద్య నిపుణుల హెచ్చరిక
Facial Symptoms | ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట వాస్తవం. డబ్బు, ఆస్తులు కంటే ఆరోగ్యం ముఖ్యమని అందరూ అంగీకరిస్తారు. ఈ మధ్య గుండెపోటు సమస్య యువతలోనూ ఎక్కువవుతూ వస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం గుండెపోటు రాకముందే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అందులో ముఖంపై కనిపించే కొన్ని చిన్న లక్షణాలు కూడా ప్రాణాంతక ప్రమాదాన్ని సూచించవచ్చని చెబుతున్నారు.

#image_title
ఈ విషయాల్లో జాగ్రత్త..
పంటి నొప్పి సాధారణ సమస్యగానే భావించే వారు చాలామంది ఉన్నారు. కానీ వైద్యుల మాటల్లో పంటి నొప్పి లేదా దవడ నొప్పి పదే పదే వస్తుంటే అది హృదయ సంబంధిత సమస్యలకు సూచన కావచ్చని చెబుతున్నారు. ఈ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. లేకపోతే అది గుండెపోటుకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా కొంతమందికి తరచుగా దవడలో నొప్పి వస్తుంటుంది. దీనిని సాదారణమైనదిగా భావించడం పొరపాటే. గుండెపోటుకు ఇది ఒక ముందస్తు హెచ్చరిక కావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిగుళ్ల నుంచి రక్తస్రావం పదే పదే జరగడం కూడా హృదయ సంబంధిత సమస్యలకు సంకేతమని చెబుతున్నారు. ముఖం, పంటి నొప్పి, దవడ నొప్పి, చిగుళ్ల రక్తస్రావం వంటి లక్షణాలను అస్సలు విస్మరించరాదు. అవి కేవలం చిన్న సమస్యలుగా కాకుండా గుండె సంబంధిత వ్యాధుల సంకేతాలుగా కూడా భావించాలి.